అంతర్జాతీయం

అంతా కట్టుకథే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: ఆక్రమిత కాశ్మీర్‌లోని నాలుగు ఉగ్రవాద శిబిరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసిందంటూ వచ్చిన కథనాలను పాకిస్తాన్ తిరస్కరించింది. భారత్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నదని, ధ్వంసం చేసినట్లుగా చెబుతున్న ఉగ్ర శిబిరాల ప్రాంతాలకు భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాల దౌత్యవేత్తలను తీసుకెళ్ళి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని పాక్ ప్రకటించింది. అలాగే ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్లుగా సమాచారం అందించాలని భారత్‌ను కోరాలని ఈ దేశాలను అభ్యర్థిస్తామని పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. భారత మీడియా అభూత
కల్పనలను ప్రచారం చేస్తున్నదని పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి అసిఫ్ గఫూర్ అన్నారు. భారత్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు తమ పౌరులు మరణించారని పేర్కొన్న పాకిస్తాన్ భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లూవాలియాను పిలిపించి సంజాయిషీ కోరింది.