S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/24/2019 - 05:48

లండన్: ఓ ట్రక్కులో 39 శవాలు తీసుకెళుతుండగా తూర్పు లండన్‌లోని ఎస్సెక్స్ పోలీసులు చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతి చెందిన 39 మందిలో ఒక 25 ఏళ్ళ యువకుడు ఉండగా, మిగతా వారంతా వయస్సులో పెద్దవారేనని పోలీసులు గుర్తించారు. తూర్పు లండన్‌లోని ఓ పారిశ్రామిక పార్కులో జరిగిన ఘటనలో వీరంతా మరణించినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు.

10/23/2019 - 23:03

దక్షిణాసియాలో మానవహక్కుల పరిస్థితిపై వాషింగ్టన్‌లో చర్చ జరుపుతున్న అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యులు. ఇటీవల కాలంలో దక్షిణాసియా మొత్తంలో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది

10/23/2019 - 22:55

లాహోర్, అక్టోబర్ 23: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. 69 ఏళ్ల షరీఫ్‌ను ప్లేట్‌లెట్స్ కౌంట్ అత్యంత దారుణంగా పడిపోవడంతో లాహోర్‌లోని సర్వీసెస్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు మెరుగైన సేవలు అందించాలని ఇమ్రాన్ కోరారు.

10/23/2019 - 22:40

వాషింగ్టన్, అక్టోబర్ 23: వచ్చే వారం సౌదీ అరెబియాలో జరిగే వార్షిక ఆర్థిక సదస్సుకు అమెరికా నుంచి వెళ్ళే ముఖ్య ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి దేశాధ్యక్షుని సలహాదారుడు జరెడ్ ఖుష్నర్, ఆర్థిక కార్యదర్శి స్టీవెన్ మ్నుచిన్ నాయకత్వం వహిస్తారని అమెరికా మీడియా పేర్కొంది. గత ఏడాది అసమ్మతి జర్నలిస్టు జమాల్ ఖష్యోగి హత్యతో నిరసనగా అనేక కార్యక్రమాల విస్తృత బహిష్కరణల అనంతరం దీనిని చేపట్టింది.

10/23/2019 - 22:37

ఇస్లామాబాద్, అక్టోబర్ 23: కర్తార్‌పూర్ కారిడార్‌ను ఉపయోగంలోకి తీసు కు రావడానికి సంబంధించి భారత్‌తో చరిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు గురువారం సంతకాలు చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ బుధవారం తెలిపింది. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల డేరా బాబా నానక్ ఆలయాన్ని పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో గల గురుద్వారాను ఈ కారిడార్ అనుసంధానం చేస్తోంది.

10/23/2019 - 01:51

వాషింగ్టన్, అక్టోబర్ 22: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దు నేపథ్యంలో భారత ప్రభుత్వ అభివృద్ధి అజెండాను తాము బలపరుస్తున్నామని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఒక మెలిక పెట్టింది. కాశ్మీర్‌లో తాజా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ముఖ్యంగా కాశ్మీర్ లోయలో పరిణామాలు అలజడి కలిగిస్తున్నాయని పేర్కొంది.

10/23/2019 - 01:49

టోక్యో, అక్టోబర్ 22: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీతో మంతనాలు జరిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, ఇతరత్రా కీలక అంశాలపై వారు చర్చించారు. జపాన్ చక్రవర్తి నారుహిటో పట్ట్భాషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరయ్యారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు విద్యాదేవి భండారీ కూడా చేరుకున్నారు.

10/23/2019 - 03:59

*చిత్రం... జపాన్ రాజధాని టోక్యోలో భారత సంతతి ప్రజలు ఇచ్చిన ఓ విందు సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన భార్య సవిత, భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ ప్రభృతులు

10/21/2019 - 22:40

*చిత్రం...జపాన్‌లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ టోక్యోలోని ఓ బౌద్ధ ఆలయంలో మహాబోధి వృక్షం మొక్కను నాటుతున్న దృశ్యం

10/21/2019 - 22:34

లండన్, అక్టోబర్ 21: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణకు సంబంధించి అక్టోబర్ 31 డెడ్‌లైన్ పొడిగించడానికి అన్యమనస్కంగా అంగీకరించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం పట్టువీడడం లేదు. మరో 11 రోజుల వ్యవధిలో ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం ఖాయమని ఆయన తీవ్ర స్వరంతో చెబుతున్నారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో శనివారం సాగిన హై డ్రామాలో జాన్సన్ బ్రెగ్జిట్ ప్రయత్నాలకు చుక్కెదురైంది.

Pages