అంతర్జాతీయం

షరీఫ్‌కు ఉత్తమ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 23: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. 69 ఏళ్ల షరీఫ్‌ను ప్లేట్‌లెట్స్ కౌంట్ అత్యంత దారుణంగా పడిపోవడంతో లాహోర్‌లోని సర్వీసెస్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు మెరుగైన సేవలు అందించాలని ఇమ్రాన్ కోరారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధినాయకుడైన నవాజ్ షరీఫ్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. పనామా పేపర్స్ కుంభకోణంలో ఆయనపై నమోదైన కేసును సుప్రీంకోర్టు విచారించింది.
అదేవిధంగా అల్ అజీజియా స్టీల్ మిల్స్ కేసును కూడా విచారించింది. షరీఫ్ దోషిగా తేలారని పేర్కొంటూ అతనికి ఏడేళ్ల జైలుశిక్షను విధిస్తూ గత ఏడాది డిసెంబర్ 24న తీర్పును వెల్లడించింది. అప్పటినుంచి జైలులోనే ఉన్న షరీఫ్‌కు బెయిల్ కూడా లభించలేదు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయనను ఆసుపత్రికి తరలించడం, తిరిగి జైలుకు తీసుకువెళ్లడం ఆనవాయితీగా మారింది. కాగా, ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్లేట్‌లెట్స్ కౌంట్ ఏకంగా 2వేలకు పడిపోవడంతో సర్వీసెస్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆయనకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని మెడికల్ బోర్డు చీఫ్ డాక్టర్ అయాజ్ మహమూద్ ప్రకటించారు. ప్లేట్‌లెట్స్ కౌంట్ 2వేల నుంచి 20 వేలకు పెరిగినట్టు ప్రకటించారు.
ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని స్పష్టం చేశారు. 1.50 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో ప్లేట్‌లెట్స్ మధ్యలో కౌంట్ ఉండాలని చెప్పారు. ఏకంగా 2వేలకు పడిపోవడంతో ప్రత్యేక చికిత్స అందించాల్సి వచ్చిందని అన్నారు. మరో 48 గంటలు గడిస్తేగానీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేమని పేర్కొంది.

*చిత్రం... మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌