అంతర్జాతీయం

రెచ్చగొడుతున్న రావత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 26: భారత సైనిక ప్రధానాధికారి బిపిన్ రావత్ రెచ్చగొట్టేలా, యుద్ధాని ప్రేరేపించేలా ప్రకటనలు చేస్తున్నారని పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. పాకిస్తాన్‌ను పదేపదే రెచ్చగొడుతూ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని సైన్యం ఆరోపించింది. ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ‘ఉగ్రవాదుల నియంత్రణలోనే ఉంది’అన్న రావత్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ విరుచుకుపడింది. న్యూఢిల్లీలోని ఫీల్డ్‌మార్షల్ కేఎం కరియప్ప స్మారక ఉపన్యాసం ఇస్తూ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలోని గిల్జిత్-బాల్టీస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ అనైతిక కార్యక్రమాలు వాడుకుంటోందని భారత ఆర్మీ చీఫ్ ఆరోపించారు. పీఓకే ఉగ్రవాదులు గుప్పెట్లోనే ఉందన్న రావత్ ప్రకటనపై పాకిస్తాన్ మండిపడింది. ‘మాపై రావత్ పదేపదే అసత్యాలు మాట్లాడుతున్నారు. యుద్ధాన్ని ప్రేరేపించేలా ఆయన తీరు ఉంటోంది. ఆర్మీ చీఫ్‌గా ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు’అని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ ఘూ్ఫర్ విమర్శించారు. భారత ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా(సీడీఎస్) పదవిపై కనే్నసిన రావత్ దాన్ని చేజిక్కించుకోవడానికే ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ధ్వజమెత్తారు. సీడీఎస్‌లో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలన్న ఉద్దేశంతోనే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఘూ్ఫర్ అన్నారు. సరిహద్దుల్లో శాంతికి విఘాతం కలిగేలా ఆర్మీ చీఫ్ మాట్లాడడం దుర్మార్గమని ఆయన చెప్పారు. సీడీఎస్ పదవి కోసమే ఇలాంటికి ప్రకటనలు చేస్తున్నారని అలీ ఘూ్ఫర్ మరోసారి ధ్వజమెత్తారు. బిపిన్ రావత్ సైనికాధికారిగా కాకుండా ఓ రాజకీయ వేత్తగా వ్యవహరిస్తున్నారని పాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నకిలీ సర్జికల్ స్ట్రయిక్‌ను చేసి దానే్న పదేపదే చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు‘అని ఘూ్ఫర్ తన ట్విట్టర్‌లో రావత్‌పై విరుచుకుపడ్డారు. ఇలా ఉండగా ఘూ్ఫర్ వ్యాఖ్యలపై ఇప్పటికైతే భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి స్పందన తెలపలేదు. అయితే సీనియర్ సైనికాధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఇలాంటి అబద్ధాలు, నిరాధారమైన ఆరోపణలపై స్పందించాల్సిన పనిలేదు’అని అన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించాయి. అన్ని రకాల దౌత్య సంబంధాలను పాకిస్తాన్ తెంచేసుకుంది. న్యూఢిల్లీలోని తమ హైకమిషనర్‌ను వెనక్కి రప్పించడంతో పాటు పాకిస్తాన్‌లోని రాయబారిని బహిష్కరించింది. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించినా పాకిస్తాన్‌కు కలిసిరాలేదు. ప్రపంచ దేశాలేవీ పాకిస్తాన్‌కు మద్దతు తెలపలేదు. పైగా కాశ్మీర్ అంశం భారత్ అంతరంగిక వ్యవహారమని తేల్చిచెప్పాయి. అలాగే కాశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమని, ఇది తమ సొంత వ్యవహారమని భారత్ అంతర్జాతీయ వేదికపై వాదించి, మద్దతు పొందింది.

*చిత్రం...పాక్ మేజర్ జనరల్ అసిఫ్ ఘూ్ఫర్