అంతర్జాతీయం

ఎన్నికలపై జాన్సన్ దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 23: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికి (బ్రెగ్జిట్‌కు) ఇచ్చిన అక్టోబర్ 31 గడువును మరో మూడు నెలల పాటు పొడిగించడానికి ఈయూ ఒప్పుకుంటే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడానికి బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సిద్ధమవుతున్నారు. బ్రిటన్ పార్లమెంటులో ఈయూనుంచి ఉపసంహరణ బిల్లును త్వరగా ఆమోదింపచేసుకోవడానికి తాను ప్రతిపాదించిన ‘్ఫస్ట్-ట్రాక్ టైమ్‌టేబుల్’ను ఎంపీలు తిరస్కరించడంతో బోరిస్ జాన్సన్ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడానికి తయారవుతున్నారు. బ్రిటన్ పార్లమెంటు దిగువసభ (హౌస్ ఆఫ్ కామన్స్)లో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల తరువాత జాన్సన్ తన బ్రెగ్జిట్ బిల్లును గెలిపించుకోగలిగారు. బిల్లుకు మద్దతుగా 322 మంది ఎంపీలు ఓటు వేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీలు వ్యతిరేకించడంతో బిల్లుకు వ్యతిరేకంగా 299 ఓట్లు పడ్డాయి. అయితే, అక్టోబర్ 31వ తేదీ గడువులోగా ఈయూనుంచి ఉపసంహరణకు సంబంధించిన బిల్లును త్వరితగతిన ఆమోదింపచేసుకోవడానికి ఉద్దేశించిన అనుసంధాన తీర్మానాన్ని నెగ్గించుకోవడంలో జాన్సన్ విఫలమయ్యారు. ‘అక్టోబర్ 31వ తేదీలోగా ఈయూనుంచి బ్రిటన్ వైదొలగడానికి దోహదం చేసే టైమ్‌టేబుల్‌ను కాదని బ్రెగ్జిట్ ప్రక్రియ జాప్యం జరగడానికే సభ ఓటు వేసినందు వల్ల నేను తప్పనిసరిగా నా నిరుత్సాహాన్ని వ్యక్తం చేయవలసిందే. మనమిప్పుడు తదుపరి అనిశ్చితిని ఎదుర్కొంటున్నాం’ అని జాన్సన్ రెండు అంశాలపై ఓటింగ్ ముగిసిన తరువాత దిగువసభలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. ఇప్పుడు అందరి దృష్టి యూరోపియన్ యూనియన్ వైపు మళ్లింది. తననుంచి నుంచి వైదొలగడానికి బ్రిటన్‌కు మరోసారి గడువు పొడిగించాలా? అనే అంశంపై ఈయూ తన ఆర్థిక బ్లాక్‌లోని మిగతా 27 దేశాలతో చర్చలు జరుపుతోంది. ‘ఈయూ ఒక నిర్ణయం తీసుకునేంత వరకు మేము ఈ బిల్లును నిలిపి ఉంచుతాము’ అని జాన్సన్ దిగువ సభలో ప్రకటించారు. అయితే, జాన్సన్ ఇప్పుడు తన దృష్టినంతా సార్వత్రిక ఎన్నికలపై కేంద్రీకరించారని ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం సూచనప్రాయంగా వెల్లడించింది. బ్రెగ్జిట్ ఆలస్యం కావడం మినహా మరో మార్గం లేని స్థితిలో తాను ఉన్నానని, దీనికి 2020 జనవరి వరకు లేదా అంతకన్నా ఎక్కువ కాలమే పట్టవచ్చని జాన్సన్ మంగళవారం పార్లమెంటులో వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బ్రెగ్జిట్‌ను త్వరగా పూర్తిచేయాలనే నినాదాన్ని ఇస్తానని కూడా జాన్సన్ అన్నట్టు సమాచారం. మరోవైపు, బ్రిటన్ వైదొలగడానికి విధించిన గడువు అక్టోబర్ 31ని పొడిగించడానికి యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ సుముఖంగా ఉన్నారు. అయితే, బ్లాక్‌లోని బ్రిటన్ మినహా మిగతా 27 దేశాలు ఈ అంశంపై నిర్ణయం తీసుకోవలసి ఉంది.
*చిత్రం...బ్రెగ్జిట్‌పై జరిగిన సమావేశంలో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్