S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/06/2019 - 05:04

వాషింగ్టన్, నవంబర్ 5: భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ఛత్‌పూజను భక్తిప్రపత్తులతో ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలో నివసిస్తున్న 500కు పైగా మంది భారత సంతతి ప్రజలు పోటోమాక్ నది ఒడ్డుకు చేరుకొని ఛత్‌పూజను నిర్వహించారు. అనేక మంది మహిళలు రంగురంగుల సంప్రదాయ చీరలు కట్టుకొని సూర్యదేవుడిని పూజించారు. భారత్‌లో తూర్పు, ఉత్తర ప్రాంతంలో, నేపాల్‌లో ప్రధానంగా ఛత్‌పూజను జరుపుకుంటారు.

11/06/2019 - 04:47

షాంఘై, నవంబర్ 5: పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా లాంఛనంగా నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల ఫ్రాన్స్ మంగళవారం విచారం వ్యక్తం చేసింది. అమెరికా తీసుకున్న ఈ చర్య ఊహించిందేనని, అయితే ఈ చర్య పట్ల తాము విచారం వ్యక్తం చేస్తున్నామని, ఈ చర్య వల్ల వాతావరణం, జీవవైవిధ్యంపై ఫ్రాంకో-చైనీస్ భాగస్వామ్యం అవసరం మరెంతో పెరిగిందని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

11/06/2019 - 02:02

వాషింగ్టన్, నవంబర్ 5: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం మరోసారి తెరమీదికి వచ్చింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరితే, ఒప్పందంపై సంతకం చేయడానికి అమెరికాకు రావలసిందిగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియెన్ ఈ విషయం తెలిపారు.

11/06/2019 - 01:57

వాషింగ్టన్, నవంబర్ 5: వాతావరణ మార్పును నిరోధించడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా లాంఛనంగా ప్రకటించింది. భూతాపంతో పోరాడటానికి భారత్ సహా 188 దేశాలు ఒక్కటయి కుదుర్చుకున్న పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా ఐక్యరాజ్య సమితి (ఐరాస)కు తెలియజేసింది.

11/06/2019 - 01:56

షాంఘై, నవంబర్ 5: ఇటీవలి కాలంలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈ) క్యారీ లామ్ పట్ల చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అత్యంత విశ్వాసం వ్యక్తం చేశారు. పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్ నగరంలో హింసాత్మక ప్రదర్శనలు పెరిగిన కొన్ని నెలల తరువాత వీరిద్దరు భేటీ అయ్యారు.

11/05/2019 - 22:12

*చిత్రం...మాస్కోలోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మంగళవారం నివాళులు అర్పిస్తున్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

11/05/2019 - 05:01

బ్యాంకాక్, నవంబర్ 4: భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

11/05/2019 - 02:54

బ్యాంకాక్, నవంబర్ 4: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ విషయంలో ఖచ్చితంగా, రాజీలేని ధోరణితో వ్యవహారించాల్సిందేనని పేర్కొన్న ఆయన ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినా ఏ దేశాన్నీ వదలకూడదు’ అని విస్పష్టంగా తెలియజేశారు.

11/04/2019 - 23:19

బ్యాంకాక్, నవంబర్ 4: భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింగో అబే సోమవారం ఇక్కడ ద్వైపాక్షిక, భద్రత అంశాలపై విస్తృత సమీక్ష జరిపారు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను వీరు లోతుగా సమీక్షించారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించారు.

11/04/2019 - 04:04

*చిత్రం... మయన్మార్ నాయకురాలు హంగ్‌సాంగ్ సూకీతో ఆదివారం బ్యాంకాక్‌లో సమావేవమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ

Pages