అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, నవంబర్ 4: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ విషయంలో ఖచ్చితంగా, రాజీలేని ధోరణితో వ్యవహారించాల్సిందేనని పేర్కొన్న ఆయన ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినా ఏ దేశాన్నీ వదలకూడదు’ అని విస్పష్టంగా తెలియజేశారు. భారత్ సహా 18 దేశాలతో కూడిన తూర్పు-ఆసియా 14వ శిఖరాగ్ర సదస్సునుద్ధేశించి నరేంద్ర మోదీ సోమవారం నాడిక్కడ మాట్లాడారు. తీవ్రవాదం అన్నది అత్యంత హేయమైన నేరమని, ఈ జాఢ్యంపై అంతర్జాతీయంగా నిర్ణయాత్మక చర్యలు అవసరం అని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని తుద ముట్టిస్తామంటూ తూర్పుఆసియా దేశాలు ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. అలాగే అంతర్జాతీయంగా ఉన్న ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలతోనూ, ఎఫ్‌ఏటీఎఫ్ వంటి మనిలాండరింగ్ నిరోధక సంస్థలతోనూ కలిపి పని చేస్తామని వెల్లడించాయి. ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే అన్ని దేశాలూ ఉమ్మడిగా ప్రయత్నించాల్సిందేనని ఈ సందర్భంగా మోదీ విస్పష్టంగా తెలియజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విజయ ఠాకూర్ సింగ్ వెల్లడించారు. తీవ్రవాదంతో పాటు అతివాదాన్ని కూడా పెంపొదిస్తున్న శక్తులను వదలడానికి కూడా వీలులేదని మోదీ తేల్చి చెప్పారని ఆమె విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. 2005లో ఏర్పడ్డ తూర్పు ఆసియా దేశాల కూటమి ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో భద్రతా రక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పటిష్టతకు కృషి చేస్తోంది. ఆవిర్భావం నుంచి కూడా తూర్పు ఆసియాను వ్యూహాత్మకంగా తీర్చిదిద్దడానికి భౌగోళిక రాజకీయ, ఆర్థికంగా శక్తివంతంగా తీర్చిదిద్ధడానికి ఈ శిఖరాగ్ర సదస్సు ఎంతగానో తోడ్పడ్డాయి. ఇందులో 10 ఆసియా దేశాలతో పాటు భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు కూడా సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన నరేంద్ర మోదీ ఇండో-్ఫసిఫిక్ ప్రాంతంలో ఆసియాన్ దేశాల చర్యలను భారత్ గట్టిగా బలపరుస్తోందని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు, ఆసియాన్ కూటమి చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాంతంలో సురక్షితమైన పరిస్థితులు కల్పించడానికి ఇండో-్ఫసిఫిక్ మహా సముద్ర పరివాహక దేశాల కూటమి ఏర్పాటు చేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమావేశానంతరం తూర్పు ఆసియా దేశాల కూటమి తమ భవిష్యత్తు వ్యూహాలను ఆవిష్కరిస్తూ ప్రకటనలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని, దానిని పెంపొందించేందుకు జరుగుతున్న అన్ని చర్యలను నిరోధిస్తామని తెలిపింది. అలాగే ఉగ్రవాద సంస్థలకు ఆర్థికంగా ఎలాంటి నిధులు అందకుండా ఎఫ్‌ఏటీఎఫ్ నిబంధనలను అమలు చేస్తామని తెలిపింది. అలాగే సమాచార, కమ్యూనికేషన్ల టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చర్యలు చేపటడతామని వెల్లడించింది. తమ, తమ దేశీయ చట్టాలకు నిబంధనలకు అనుగుణంగా అంతర్-జాతీయ నేరాలను అరికట్టేందుకు తూర్పు ఆసియా దేశాలు మరింత సహకారంతో పని చేయాలని ఈ శిఖరాగ్రం పిలుపునిచ్చింది.
ఇదిలాఉండగా బ్యాంకాక్‌లో ఇండో ఆసియాన్, తూర్పు ఆసియా, ఆర్‌సీఈపీ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్వదేశానికి పయనమయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రబీష్ కుమార్ ట్వీట్ చేశారు.
*చిత్రం...థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం జరిగిన తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాల నేతలతో భారత ప్రధాని మోదీ