అంతర్జాతీయం

భారత్‌తో చర్చలపై పాక్ జవాబుదారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 25: ద్వైపాక్షిక చర్చలు జరిపి, ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధపూరిత వాతావరణాన్ని తొలగించే విషయంలో పాకిస్తాన్ జవాబుదారీ వహించాలని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి కలిసి నడిచే అవకాశమే లేదని వ్యాఖ్యానించింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి, కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం నెరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి గుర్తుచేశారు. అయితే, ఇరు దేశాలు కోరుకుంటేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారిపోయిందని చెప్పారు. కాశ్మీర్ అంశంపై చర్చ జరిగి, ఒక అవగాహనకు వస్తేతప్ప శాంతయుత వాతావరణం నెలకొనే అవకాశాలు లేవని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. ఆయితే, ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకొని, అమలు చేయాల్సిన బాధ్యత పాక్‌పైనే ఉందన్నారు. భారత్‌తో చర్చల అంశంపై పాకిస్తానే జవాబుదారీ వహించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇటీవల న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ట్రంప్ సమావేశమైనప్పుడు కొన్ని అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. అంతకు ముందు జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ట్రంప్ స్వయంగా పాల్గొన్న విషయాన్ని సదరు అధికారి ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త తావరణం నెలకొనడం ఎవరికీ మంచిది కాదని వ్యాఖ్యానించారు. అయితే, ఉగ్రవాదం కొనసాగుతున్నంత వరకూ చర్చలు సాధ్యంకావని చెప్పారు. ఈ రెండూ ఒకేసారి, చెట్టపట్టాలేసుకొని ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. ఉగ్రవాద అణచివేతకు పాకిస్తాన్ కంకణం కట్టుకోవాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. అప్పటి వరకూ భారత్‌తో శాంతి చర్చలు సాధ్యం కావని ఆయన తేల్చిచెప్పారు. శాంతి చర్చల్లో ట్రంప్ భాగస్వామి కావాలంటే కూడా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకొని, ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని అన్నారు.