అంతర్జాతీయం

74మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 31: పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గురువారం ఓ రైల్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిన ఘోర ప్రమాదంలో 74మంది దుర్మరణం చెందారు. అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ విస్ఫోటనం సంభవించిందని, కరాచీ నుంచి రావల్పిండి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఓ మత కార్యకమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఇస్లాం బోధకులు ఈ రైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు వల్ల సంభవించిన మంటల్లో ధ్వంసమైన మూడు బోగీల్లోనే మహిళలు, పిల్లలు సహా 200మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
40మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారనీ, వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రమాద కారణంగా సంభవించిన మంటల్లో మూడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ ధ్రువీకరించారు. గ్యాస్ సిలిండర్‌తో పాటు స్టవ్ కూడా తెచ్చుకున్న యాత్రికులు అల్పాహారం సిద్ధం చేసుకోవడానికి నిబంధనలకు విరుద్ధంగా దాన్ని వెలిగించారని, దాంతో ఒక్కసారిగా ఆ సిలిండర్ పేలి రైలు వేగానికి మరింతగా మంటలు వ్యాపించాయని తెలిపారు. మంటలు వ్యాపించిన సమయంలో చాలామంది ప్రయాణికులు దూకేయడం వల్లే మరణించారని ఆయన తెలిపారు. మృతులందరూ ఇస్లాం మత ప్రవక్తలేనని, వీరంతా ఓ వార్షిక మత కార్యక్రమంలో పాల్గొనేందుకు లాహోర్ వెళ్తున్నారని తెలిపారు. అల్పాహారం సిద్ధం చేసుకోవడం కోసం రెండు గ్యాస్ స్టవ్‌లను వెలిగించారని, ప్రయాణికుల్లో కొందరివద్ద కిరోసిన్ క్యాన్లు కూడా ఉండటంతో విస్ఫోటన తీవ్రతకు అదికూడా మండి మంటలు తీవ్రమయ్యాయని చెప్పారు. స్టవ్ వెలిగించొద్దని రైల్వే గార్డు వారించడంతో స్టవ్ ఆపేసిన యాత్రికులు అతడు వెళ్లిపోయిన వెంటనే మళ్లీ వెలిగించారని ఆయన చెప్పారు. కాగా గ్యాస్‌తో వెలిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ వచ్చిన కథనాలను తబ్లీగీ జమాత్ కార్యాలయ ప్రతినిధి ఖండించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు రైల్వే అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన గాయపడ్డవారికి ఎలాంటి జాప్యం లేకుండా చికిత్స అందించాలని ఆయన తెలిపారు. మంటలను ఆర్పేందుకు పది అగ్నిమాపక దళాలను రంగంలోక దింపామని, కొన్ని గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.
*చిత్రాలు..పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గురువారం తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిన ధాటికి కాలిపో యిన బోగీలు.
*క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న సహాయక సిబ్బంది. (ఇన్‌సెట్‌లో )