అంతర్జాతీయం

ఆసియాన్‌తో బంధం దృఢం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, నవంబర్ 3: ఆసియాన్ దేశాలతో అన్ని రంగాల్లోనూ విస్తృత స్థాయి సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు ఇక్కడ స్పష్టం చేశారు. భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మాట్లాడిన మోదీ ఈ కూటమిలో సభ్యత్వం కలిగిన 10 దేశాలతో భారత్ ఉపరితల, గగనతల, సముద్రపరమైన సంధానతను పెంపొందించుకుంటే ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరుగుతాయని అన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత భద్రతకు కూడా భారత్-ఆసియాన్ మధ్య లోతైన సహకార బంధం ఎంతో అవసరమన్నారు. వ్యవసాయం, ఇంజనీరింగ్, డిజిటల్ టెక్నాలజీ, శాస్త్ర పరిశోధనలకు సంబంధించి కూడా మరింతగా సహకారం పెంపొందాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. అలాగే, ఇండో-్ఫసిఫిక్ ప్రాంతంలో సహకారానికి సంబంధించి కూడా భారత్-ఆసియాన్ దేశాల మధ్య ఎంతో భావసారూప్యత ఉందని తెలిపారు. భారత ప్రభుత్వం చేపట్టిన ప్రాచ్య దృక్కోణపు విధానం ఇండో-పసిఫిక్ సహకారంలో కీలక స్థానమని, ఇందులో ఆసియాన్ దేశాలకు కూడా ఎంతో కీలక ప్రాధాన్యత ఉందని మోదీ వివరించారు. అలాగే, ఆసియాన్ దేశాల మధ్య ఆర్థికంగా ఎంత సహకారం పెంపొందితే అంతగానూ భారత ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 10 సభ్య దేశాలు కలిగిన ఆసియాన్ కూటమి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత కీలకమైన ప్రాంతీయ గ్రూప్‌గా రాణిస్తోంది. భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఈ కూటమిలో చర్చల భాగస్వామ్య దేశాల హోదాలో కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆసియాన్ దేశాలతో భారత్ సంబంధాలు గుణాత్మకంగా విస్తరిస్తూనే వస్తున్నాయి. భారత్ జనాభా, ఈ కూటమిలోని 10 దేశాల జనాభా కలిస్తే ఉమ్మడి జనాభా 1.85 బిలియన్లకు చేరుకుంటుంది. అంటే ప్రపంచ జనాభాలో ఇది నాలుగో వంతు అన్నమాట. అలాగే, వీటి ఉమ్మడి స్థూల జాతీయోత్పత్తి కూడ 3.8 ట్రిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది. గత 17 ఏళ్ల కాలంలో ఆసియాన్ దేశాల నుంచి భారత్‌కు 70 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అంటే భారత్‌లో ఉన్న మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఆసియాన్ దేశాల వాటా 17 శాతం.
అవకాశాలు పుష్కలం
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు సంబంధించి ఏ దేశంలోనూ లేని అవకాశాలు భారత్‌లో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల అనుకూల దేశంగా భారత్ రాణిస్తోందని అన్నారు. ప్రస్తుతం భారత్‌లో పరిణామాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల కూటమితో మాట్లాడిన మోదీ భారత్‌లో చేపట్టిన పన్నుల సంస్కరణల విధానాన్ని సోదాహరణంగా ప్రస్తావించారు. భారత్‌లో కష్టపడి పనిచేసి సంపాదించి పన్ను కట్టే ప్రతి ఒక్కరికీ ఎంతో విలువ ఉందని అన్నారు. ట్యాక్సేషన్‌కు సంబంధించి సానుకూల విధానాన్ని తీసుకువచ్చామని, అన్నివిధాల అనుకూలమైన పరిస్థితులను పాదుగొల్పామని తెలిపారు. దీనిని మరింతగా మెరుగుపర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన అన్నారు. పెట్టుబడులకు అన్నివిధాలుగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్న మోదీ ‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచాం. వ్యాపారానుకూల వాతావరణం పెంపొందింది. అలాగే, జీవన నాణ్యత, ఉత్పాదకత కూడా ఇనుమడిస్తున్నాయి. అదేవిధంగా పన్ను రేట్లు తగ్గాయి. నిర్ణయ జాప్యానికి ఆస్కారమే లేదు. అవినీతికి ఆస్కారం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆశ్రీత పక్షపాతానికి ఆస్కారమే లేదు’ అని వివరించారు. ఇన్ని సానుకూల పరిణామాలు ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకుమించిన తరుణం మరొకటి లేదన్నారు.
*చిత్రం... బ్యాంకాక్‌లో జరుగుతున్న భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో థాయ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓ చాకు ‘ఓకే’ అంటూ సంకేతమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ