అంతర్జాతీయం

మేము గెలిస్తేనే బ్రెగ్జిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 3: వచ్చే నెలలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ మెజారిటీ సాధిస్తుందన్న గట్టి నమ్మకం ఏమీ లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. అక్టోబర్ 31 డెడ్‌లైన్‌లోగా బ్రెగ్జిట్ లక్ష్యాన్ని తాను సాధించలేకపోవడాన్ని చింతిస్తున్నానని, ఈ వైఫల్యానికి కారణం పార్లమెంటేనని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో తన సారథ్యంలో మళ్లీ కన్జర్వేటివ్ పార్టీ మెజారిటీతో అధికారంలోకి వస్తేనే జనవరి 31లోగా ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం సాధ్యమవుతుందని స్కైన్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్సన్ తెలిపారు. అయితే, ఇప్పటికే ఈ డెడ్‌లైన్ చేయి దాటిపోవడం మాత్రం తీవ్ర విచారక విషయమని పేర్కొన్న ఆయన ఇప్పటికైనా పార్టీ ఎంపీలంతా కలసికట్టుగా ఈ అంశంపై ముందుకు సాగాలని, బ్రెగ్జిట్ లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. మిగతా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బ్రెగ్జిట్ అంశం ముందుకెళ్లే అవకాశమే ఉండదని, ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సాధించే దిశగా పార్టీ నేతలు పనిచేయాలని జాన్సన్ అన్నారు. అయితే, అనుకున్న విధంగా అందరూ మెజారిటీ కోసం పనిచేస్తారా అన్నది ప్రశ్నార్థకమేనన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.