అంతర్జాతీయం

భారత్‌కు ఆసియాన్ దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాంక్, నవంబర్ 3: ఇండో-్ఫసిఫిక్ ప్రాంతంలో భారత దేశం అత్యంత కీలక రీతిలో క్రియాశీలక భూమిక పోషిస్తున్నదని 10 దేశాల ఆసియా కూటమి స్పష్టం చేసింది. భారత్‌కు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉంటామని, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి సవాళ్ళను ఉమ్మడి శక్తితో ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉమ్మడిగా ఐదు ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తి కలిగిన ఆసియా దేశాల కూటమి ఇండో-్ఫసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న 16వ ఇండో-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో భారత్‌కు పూర్తి స్థాయి మద్దతు లభించడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఇండో, పశ్చిమ ప్రాంతంలో భౌగోళిక, రాజకీయ అధిపత్య ధోరణులు ప్రబలుతున్న నేపథ్యంలో ఈ 10 దేశాల కూటమి భారత్‌కు వంత పాడడం అంతర్జాతీయంగా కీలక పరిణామం. అలాగే ప్రాంతీయంగా పెరుగుతున్న భారత శక్తియుక్తులకు దీనిని నిదర్శనంగా చెబుతున్నారు. ముఖ్యంగా చైనాతో అనేక ఆసియా దేశాలకు ప్రాదేశికపరమైన విభేదాలు తీవ్రమవుతున్న తరుణంలో ఆసియాన్ శిఖరాగ్రం తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం. ఇండో-్ఫసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత పెరగడం అన్నది ఇక్కడ శాంతి సుస్థిరతల స్థాపనకు ఎంతగానో దోహదం చేస్తున్నదని పేర్కొంది. కాగా దక్షిణ చైనా మహా సముద్ర ప్రాంతంలో శాంతి-్భద్రత, సుస్థిరతల స్థాపనకు ఆసియాన్ దేశాలతో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రతినిధి లీకియాంగ్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. కాగా ఈ శిఖరాగ్ర సదస్సులో దక్షిణ చైనా మహా సముద్ర ప్రాంతం పరిణామాలపై చర్చ జరిగిందని, ముఖ్యంగా భారత్‌కు సంబంధించి ఈ కూటమి దేశాలు ముక్తకంఠంతో వ్యవహారించడం వాటి విశాల ధృక్పథానికి నిర్ధుష్ట వైఖరికి నిదర్శనమని భారత్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ అన్నారు. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే అన్ని దేశాలు తమ కార్యకలాపాలు సాగించాలని, అదేవిధంగా విధివిధానాల ఆధారిత వ్యవస్థను బలంగా పాదుకొల్పాలని ఆయన స్పష్టం చేశారు.
*చిత్రం... ఏషియన్ కూటమి దేశాల నేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ