అంతర్జాతీయం

మానవ హక్కులకు ఉగ్రవాదమే ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 16: మానవ హక్కులకు, పౌర స్వేచ్ఛకు ఉగ్రవాదం, ఛాందసవాద తీవ్రవాదం కన్నా మించిన పెద్ద ముప్పు మరోటి లేదని కాశ్మీరీ పండిట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక అమెరికా సంస్థ యూఎస్ కాంగ్రెస్ కమిటీకి తెలియజేసింది. రాజకీయంగా ప్రేరేపితమయిన వాంగ్మూలాల వల్ల తప్పుదారి పట్టొద్దని సూచించింది. టామ్ లాంటస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రికార్డు చేయడానికి ఇచ్చిన ఒక ప్రకటనలో కాశ్మీరీ ఓవర్సీస్ అసోసియేషన్ (కేఓఏ) ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గత 30 ఏళ్లుగా మానవ హక్కుల విషయంలో వౌన బాధితులుగా ఉన్న తమ కమ్యూనిటీ సభ్యులను సంప్రదించాలని కమిషన్ భావించకపోవడం పట్ల కేఓఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా ప్రతినిధుల సభకు చెందిన డెమొక్రటిక్ పార్టీ ఆధిపత్యం కలిగిన కమిషన్ గురువారం జమ్మూకాశ్మీర్‌లో మానవ హక్కుల పరిస్థితిపై విచారణ జరిపింది. కేఓఏ అధ్యక్షుడు షాకున్ మున్షీ, కార్యదర్శి అమృత కౌర్ ఒక స్టేట్‌మెంట్‌ను కమిషన్‌కు సమర్పించారు. ఈ స్టేట్‌మెంట్‌ను వారు శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. రాజకీయ ప్రేరేపిత వాంగ్మూలాలతో ఈ వేదిక తప్పుదారి పట్టకుండా చూడాలని కమిషన్ సహాధ్యక్షులయిన కాంగ్రెస్ సభ్యులు జేమ్స్ మెక్‌గోవర్న్, క్రిస్ట్ఫర్ స్మిత్‌లను కేఓఏ కోరింది. ‘సీమాంతర ఉగ్రవాదం కారణంగా భారత్ జమ్మూకాశ్మీర్‌లో ఎదుర్కొంటున్న ప్రత్యేక భద్రతా సవాళ్లను కమిషన్ గుర్తించాలి’ అని కేఓఏ సూచించింది. ‘పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న తన విధానాన్ని విడనాడాలని కమిషన్ పిలుపునివ్వాలి’ అని కేఓఏ విజ్ఞప్తి చేసింది.