అంతర్జాతీయం

చైనాకు విమానాల రాకపోకల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వూహాన్ (చైనా): కరోనా వైరస్ భయం కారణంగా విదేశీ విమానయాన సంస్థలు చైనాకు తమ విమానాల రాకపోకలను నిలిపివేయడాన్ని బుధవారం మొదలుపెట్టాయి. ఈ కొత్త వైరస్ వల్ల చైనాలో మృతుల సంఖ్య 132కు పెరగడంతో పాటు ఈ వైరస్ సోకిన వారి సంఖ్య సుమారు ఆరు వేలకు పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొనడంతో ఆ వైరస్ తమ దేశాలకు విస్తరించకూడదనే ముందు జాగ్రత్తగా ఈ దేశానికి రాకపోకలను నిలిపివేస్తున్నాయి. కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న వూహాన్ నగరంలోని విదేశీయులను ఆయా దేశాలు విమానాలలో తీసుకెళ్లడాన్ని ప్రారంభించిన కొన్ని గంటల తరువాత ఈ ప్రకటన వెలువడింది. అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా అనేక దేశాల ప్రభుత్వాలు అత్యవసరం కాని పనుల మీద చైనాకు వెళ్లకూడదని తమ పౌరులకు సూచించాయి. అలాగే, కనీసం 15 దేశాలలో కరోనా వైరస్ సోకిన కేసులను నిర్ధారించడం వల్ల చైనా కూడా విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని తన పౌరులకు సూచించింది. మధ్యప్రాచ్యంలో తొలిసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బుధవారం కరోనా వైరస్ సోకిన కేసును గుర్తించారు. ఇదిలా ఉండగా, బ్రిటిష్ ఎయిర్‌వేస్ తొలుత చైనాకు తన విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆగ్నేయాసియాలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండోనేసియాకు చెందిన లయన్ ఎయిర్ గ్రూప్ చైనాకు తన విమానాల రాకపోకలను శనివారం నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి నోటీసు జారీ అయ్యేంత వరకు ఈ నిలిపివేత అమలులో ఉంటుందని పేర్కొంది. పొరుగు దేశం మైన్మార్‌లోని మూడు విమానయాన సంస్థలు కూడా శనివారం నుంచి చైనాకు తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. తగినంత డిమాండ్ లేకపోవడంతో పాటు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి హాంకాంగ్ ప్రభుత్వం స్పందిస్తున్న ప్రణాళికలో భాగంగా విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు కాథే పసిఫిక్ ప్రకటించింది. చిన్న పసిఫిక్ దేశమయిన పాపువా న్యూ గునియా అత్యంత నాటకీయమయిన చర్యను బుధవారం ప్రకటించింది. ఆసియా నుంచి పర్యాటకులను ఎవరినీ తమ దేశంలోకి ప్రవేశించనివ్వబోమని తెలిపింది. అయితే, మిగతా అనేక విమానయాన సంస్థలు చైనాకు తమ విమాన సర్వీసులను కొనసాగిస్తామని చెప్పాయి. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ విస్తరించకుండా చైనా అసాధారణ చర్యలు ప్రకటించింది. సముద్ర మార్గం గుండా పర్యాటక బృందాల పయనంపై నిషేధం విధించింది.