అంతర్జాతీయం

క్రికెట్‌లో చిత్తుచేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 23: ఒకప్పుడు భారత్‌ను క్రికెట్‌లో చిత్తుచేశామని, ఇప్పుడు ఆర్థికంగానూ ఆ దేశాన్ని వెనక్కు నెట్టేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన ఇమ్రాన్ విలేఖరులతో మాట్లాడుతూ, తమ దేశంతో పోలిస్తే ఏడు రెట్లు పెద్దదైన భారత్‌ను అనేక పర్యాయాలు క్రికెట్‌లో ఓడించామని అన్నారు. అదే విధంగా హాకీలోనూ తిరుగులేని విజయాలను నమోదు చేశామని చెప్పారు. ప్రతిభావంతులకు, సహజ సంపదకు పాకిస్తాన్‌లో కొదువ లేదని, కానీ, గతంలో నెలకొన్న అవినీతి, నాయకుల స్వార్థం కారణంగా అభివృద్ధి కుంటుపడిందని ఇమ్రాన్ అన్నారు. 1960 దశకంలో పాకిస్తాన్ శరవేగంగా అభివృద్ధి చెందిందని, తాను ఆ దూకుడును చూస్తూ పెరిగానని తెలిపారు. అయితే, ప్రజాస్వామ్య వ్యవస్థను మిలటరీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత పాలనా యంత్రాంగ అస్తవ్యస్థమైందని ఆరోపించారు. దేశాన్ని ఏలిన కొంత మంది ఆర్మీ చీఫ్‌లు ఎంతో స్వార్థంతో వ్యవహరించారని, ఫలితంగా దేశ ప్రగతి కుంటుపడిందని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అధివృద్ధి పథంలోకి వెళుతున్నామని, ఆర్థికంగా భారత్‌ను అధిగమిస్తామని ఇమ్రాన్ జోస్యం చెప్పారు. ‘క్రికెట్ ఆడుతున్న కాలంలో నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. గెలిచిన వాడే మొనగాడని, ఓడిని వాటిపై ఎవరూ జాలి చూపరని నాకు అర్థమైంది’ అన్నారు. ‘నా తల్లి కేన్సర్‌తో మృతి చెందినప్పుడు, ఈ వ్యాధికి చికిత్స అందించే ప్రత్యేక ఆసుపత్రి లేదన్న విషయం నాకు అర్థమైంది. అందుకే, నేను ఆసుపత్రి నిర్మాణానికి నడుంకట్టాను. అయితే, ఆసుపత్రిలో ఉచితంగా చికిత్సలు జరపరాదని నన్ను హెచ్చరించారు. చివరికి సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో నేను కేన్సన్ ఆసుపత్రిని నిర్మించాను. అక్కడికి వచ్చే వారిలో 70 శాతం మందికి ఉచితంగానే చికిత్స అందుతున్నది’ అని ఇమ్రాన్ వివరించారు. తాను ఈ ప్రతిపాదన చేసినప్పుడు అందరూ నవ్వారని, ఇప్పుడు ఆసుపత్రి విలువ వారికి తెలుస్తున్నదని ఇమ్రాన్ తెలిపారు. పాకిస్తాన్‌ను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

'చిత్రం... పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు