అంతర్జాతీయం

అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 26: చైనాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న వూహాన్‌లో విద్యార్థులు సహా 250 మంది భారతీయులు చిక్కుకుపోయిన సమస్యను పరిష్కరించేందుకు చైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంలో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్టు భారత్ ఆదివారం తెలిపింది.
భయంకరమయిన ఈ కొత్త కరోనా వైరస్ కారణంగా చైనాలో మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాడు 56కు పెరిగింది. కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వారి సంఖ్య 2,008కి పెరిగింది. వీరిలో 23 మంది విదేశీయులు ఉన్నారని చైనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. భారతీయుల నుంచి ముఖ్యంగా విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్‌లు వస్తున్నందున భారత్ ఆదివారం నాడు మూడో హాట్‌లైన్‌ను ప్రారంభించిందని బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో తెలిపింది. మూడో హాట్‌లైన్ నంబర్ +8618610952903 అని వెల్లడించింది. ఇప్పటికే పనిచేస్తున్న రెండు హాట్‌లైన్ నంబర్లు +8618612083629, +8618612083617 అని ఎంబసీ వివరించింది. వూహాన్‌లో ఉండిపోయిన భారతీయులకు ఉపశమనం కలిగించేందుకు చైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఈ విషయంలో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని ఇండియన్ ఎంబసీ తెలిపింది. గత రెండు రోజుల్లో తమ హాట్‌లైన్లకు సుమారు 600 ఫోన్ కాల్‌లు వచ్చాయని వెల్లడించింది. ‘అన్ని అవకాశాలు’ అనే దానిలో వూహాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే అవకాశం కూడా ఉన్నట్టు కనపడుతోంది.
సెంట్రల్ చైనాలోని హుబేయి ప్రావిన్స్‌లో గల వూహాన్ నగరంలో 2019 డిసెంబర్‌లో తొలుత కరోనా వైరస్ సోకిన విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత ఆ వైరస్ చైనా వ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఇతర దేశాలకూ పాకింది. వూహాన్ నగరంలో, దాని చుట్టుపక్కల గల ప్రాంతాలలో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు చేరినట్టు సమాచారం.