అంతర్జాతీయం

సహజ వనరులు హరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యారిస్, జనవరి 21: ప్రకృతిసిద్ధమైన సహజ వనరులు మానవ వినియోగ కారణంగా అపారంగా హరించుకుపోతున్నాయి. మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాలు ఏడాదికి వంద బిలియన్ టన్నులకు మించి సహజ వనరులను వాడేశాయని తాజాగా జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది.
దీనికి తగ్గట్టుగా దీని పునర్‌వినియోగ ముడి పదార్థాల రీసైక్లింగ్ స్థాయి కూడా గణనీయంగా తగ్గిపోయిందని సర్క్యులారిటీ గ్యాప్ రిపోర్టు-2020 వెల్లడించింది. ప్రపంచంలో ఏ దేశం కూడా తమ పౌరుల కనీస అవసరాలను తీర్చడం లేదని, అంతేకాకుండా సహజ వనరులను అపారంగా కబళించేస్తోందని ఈ నివేదిక పేర్కొంది. ఖనిజాలు, శిలాజ ఇంధనాలు, బయో మాస్ వంటి పునర్ వినియోగ స్థాయి కూడా ఈ రెండేళ్ల కాలంలో 9.1 శాతం మించి 8.6 శాతానికి తగ్గిపోయిందని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ సహజ వనరుల వినియోగం 2015లో 93 బిలియన్ టన్నులు ఉంటే 2017 నాటికి 100.6 బిలియన్లకు చేరుకుందని ఈ సంస్థ డైరెక్టర్ మార్క్ డీ విన్ తెలిపారు. 1970 నుంచి ప్రపంచ జనాభా రెండు రెట్లు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నాలుగు రెట్లు పెరిగిందని, వాణిజ్యం పది రెట్లు విస్తరించిందని ఈ నివేదిక తెలిపింది. ఈ కారణంగా నిరంతరం ఇంధనం కోసం, వనరుల కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. 2050 నాటికి సహజ వనరుల వినియోగం 170 నుంచి 184 బిలియన్ టన్నులకు పెరిగిపోయే అవకాశం ఉంటుందని వెల్లడించింది. వీటన్నింటి ఫలితంగా ప్రకృతిసిద్ధమైన వాతావరణం నశించిపోతోందని మరో నిపుణుడు క్రిస్టియానీ తెలిపారు. సహజ వనరుల పునర్ వినియోగ స్థాయిని పెంచుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుందని సర్వే నిపుణులు తెలిపారు.
ముఖ్యంగా స్వచ్ఛమైన నీరు, గాలి, భూసారం వంటి వాటిని పరిరక్షించుకోవాలంటే సహజ వనరుల పునర్ వినియోగ పరిణామాన్ని గణనీయంగా పెంచుకోవాల్సిందేనని తెలిపారు.