• వాషింగ్టన్ : ఈ వారాంతంలో ఫ్రాన్స్‌లో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో కాశ్మీర్ అం

  • వాషింగ్టన్, ఆగస్టు 21: అఫ్గనిస్తాన్ నుంచి తమ దళాలు పూర్తిగా వైదొలగే ప్రసక్తే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/17/2019 - 23:07

థింపూ, ఆగస్టు 17: ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త రీతిలో ముందుకు తీసుకెళ్లాలని భారత్, భూటాన్‌లు నిర్ణయించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య శనివారం పలు కీలక అంశాలపై పది ఒప్పందాలు కుదిరాయి. భూటాన్ ప్రధాని లోటే షేరింగ్‌తో నరేంద్ర మోదీ అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

08/17/2019 - 22:57

వాషింగ్టన్, ఆగస్టు 17: అమెరికా ఆర్థిక మాంద్యం బారిన పడుతుందా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే మాంద్యం సంకేతాలు నిజమైనన్న భావన కలుగుతోంది. 2020 ఎన్నికల్లో తాను ఓడిపోతే ఆర్థిక మాంద్యం తప్పదని ట్రంప్ ప్రకటించారు. ఇటీవల పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరైన సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందినట్టు కనిపించారు.

08/17/2019 - 22:54

ఇస్లామాబాద్, ఆగస్టు 17: అణ్వాయుధాలపై వినియోగంపై పరిస్థితులను బట్టి తన నిర్ణయం మారుతుందన్న భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మండిపడింది. రాజ్‌నాథ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, అత్యంత దురదృష్టకరం అని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్‌మూద్ ఖురేషీ విమర్శించారు. తనంతట తానుగా భారత్ అణ్వాయుధాలు వాడదని, పరిస్థితులను బట్టి నిర్ణయం మార్చుకోవల్సి వస్తుందని రాజ్‌నాథ్ చెప్పారు.

08/16/2019 - 23:28

వాషింగ్టన్, ఆగస్టు 16: ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తి తొలగింపుపై రహస్య చర్చలు జరుపనున్నందున భారత్, పాకిస్తాన్‌లు మానవ హక్కులను పరిరక్షించాలని, ఆ ప్రాంతంలో శాంతిని పెంపొందించాలని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు షీలా జాక్సన్ లీ కోరారు. కాశ్మీర్ అంశంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ పాకిస్తాన్ ఇప్పటికే భద్రతా మండలి అధ్యక్షుడికి ఒక లేఖ రాసింది.

08/16/2019 - 23:28

ఇస్లామాబాద్, ఆగస్టు 16: భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించిన తరువాత పాకిస్తాన్ తన గడ్డపై భారతీయ చిత్రాల సీడీల విక్రయాలను అణచివేసే చర్యలు ప్రారంభించింది. శుక్రవారం ప్రచురితమయిన ఒక మీడియా కథనం ఈ విషయం వెల్లడించింది. భారత్ జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించినందుకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ ప్రకటించిన చర్యలలో ఇది తాజాది.

08/16/2019 - 23:25

కరాచీ, ఆగస్టు 16: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లో ఓ మసీదు శక్తివంతమైన బాంబు పేలడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇక్కడి క్విట్టా, కుచ్‌లాక్ ప్రాంతంలో ఉన్న మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన జరుగుతున్న సమయంలో బాంబు పేలింది.

08/16/2019 - 23:24

జైపూర్, ఆగస్టు 16: పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్ళే థార్ ఎక్స్‌ప్రెస్‌ను భారతీయ రైల్వే అధికారులు రద్దు చేశారు. ప్రతి శుక్రవారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి కరాచీకి థార్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళుతున్న సంగతి తెలిసిందే. జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ పార్లమెం టు ఆమోదించడం, దానికి రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వే యడంతో, పాక్ మండిపడుతున్నది.

08/16/2019 - 22:38

జకార్తా, ఆగస్టు 16: ఇండోనేషియా రాజధాని జకార్తా మరికొనే్నళ్లలో కాలగర్భంలో కలసిపోనున్నది. పుడమిలో త్వరితగతిన మునిగిపోతున్న నగరాల్లో ఒకటిగా జకార్తా చరిత్రలో నిలువనుంది. ప్రస్తుతం ఎదురవుతున్న పర్యావరణ, వాతావరణ పరిస్థితులు ఇదే రీతిన కొనసాగితే ఈ నగరంలోని మూడో వంతు భాగం 2050 నాటికల్లా అంతర్ధానం కానుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

08/16/2019 - 22:36

ఇస్లామాబాద్, ఆగస్టు 16: పాకిస్తాన్‌లోని అవినీతి వ్యతిరేక కోర్టు శుక్రవారం దేశ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి నకిలీ బ్యాంకు ఖాతాల కేసులో విధించిన జ్యుడీషియల్ రిమాండ్‌ను మూడు రోజు లు పొడిగించింది. ఒక మీడియా కథనం ఈ విషయం వెల్లడించింది.

08/15/2019 - 23:16

ఐక్యరాజ్యసమితి, ఆగస్టు 15: జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను మోదీ సర్కారు రద్దు చేయడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతున్నది.

Pages