అంతర్జాతీయం

ముస్లింలకు భారత్ సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 23: ముస్లింలకు సురక్షిత ప్రాంతం భారత్ మాత్రమేనని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ గురువారం ఇక్కడ నొక్కి చెప్పారు. భిన్న సామాజిక వర్గాలకు నిలయం భారతదేశం అని పియూష్ స్పష్టం చేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) 2020 సమావేశాల్లో భాగంగా ‘స్ట్రాటజిక్ ఔట్‌లుక్: ఇండియా’ అంశంపై జరిగిన సదస్సులో గోయల్ ప్రసంగించారు. యావత్ ప్రపంచంలోనే ముస్లింలకు భారత్ మాత్రమే సురక్షిత ప్రాంతమని మంత్రి పేర్కొన్నారు. భిన్న వ్యూహాలు, భిన్న అభిప్రాయాలు భారత్‌లో కలగలిసినప్పటికీ దేశ ప్రజలందరితో సమానంగా ముస్లింలకు అవకాశాలు ఉంటున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో సైతం ఎటువంటి వివక్ష భారత్‌లో ఉండదని పేర్కొన్నారు. ‘విద్యుత్ సరఫరాతో పోలిస్తే ఎక్కడా భారత్‌లో ప్రజల రంగు లేదా మతాన్ని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అడగవనీ.. ఇలా ఒకటేమిటి టాయ్‌లెట్లు, డిజిటల్ టెక్నాలజీ, బ్యాంకు ఖాతాలు, వంట గ్యాస్ వంటి సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా మతం పేరు అడగం.. మా దేశంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి’ అని గోయల్ స్పష్టం చేశారు. పొరుగు దేశాల్లో మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్న మైనారిటీలకు సైతం రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినదే పౌరసత్వ సవరణ చట్టం అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ సమ ప్రాధాన్యం కల్పించే దేశాల్లో భారత్ ఒకటని అన్నారు.