అంతర్జాతీయం

వైరస్ పరీక్షలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 14: తాను కరోనా వైరస్ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇంతవరకు తనకు ఈ వైరస్ లక్షణాలేవీ లేవని వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఇటీవల ఈ వైరస్ సోకిన బ్రెజిల్ అధికారిని ట్రంప్ కలుసుకున్న నేపథ్యంలో వైద్య పరీక్షల అంశం తెరపైకి వచ్చింది. ‘నేను పరీక్షలు చేయించుకోనని ఎప్పుడూ చెప్పలేదు’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ వెల్లడించారు. వైరస్ సోకిన బ్రెజిల్ అధికారిని ట్రంప్ కలుసుకున్నప్పటికీ ఆయన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదని వైట్‌హౌస్ చెబుతూ వచ్చింది. అయితే మీడియా సమావేశంలో మాత్రం తాను కూడా ఈ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. త్వరలోనే ఈ పరీక్షలు జరుగుతాయని కూడా ఆయన స్పష్టం చేశారు.
తాను కలుసుకున్న బ్రెజిల్ అధ్యక్షుడికి ఈ వైరస్ లేదని, అయితే ఆ దేశానికి చెందిన అధికారి కేబియో వజిన్ గార్టెన్‌కు మాత్రం వైరస్ ఉందని తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడితో తాను కలిసి భోజనం చేయలేదని, రెండు గంటలపాటు అతనితో ఉన్న మాట మాత్రం వాస్తవమేనని ట్రంప్ స్పష్టం చేశారు.
*చిత్రం... వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్