• వాషింగ్టన్, అక్టోబర్ 20: వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్-అమెరికా మధ్య జరు

  • హాంకాంగ్ మరోసారి పోలీసులు, ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారుల మధ్య ఆదివారం జరిగి

  • ఇస్లామాబాద్: ఆక్రమిత కాశ్మీర్‌లోని నాలుగు ఉగ్రవాద శిబిరాలను భారత్ సైన్యం ధ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/18/2019 - 22:31

అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా సరిహద్దులు దాటి మెక్సికోలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. వెనక్కి వచ్చేసిన భారతీయులు శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్‌పోర్టులను చూపిస్తున్న దృశ్యం

10/18/2019 - 22:24

ఇస్లామాబాద్, అక్టోబర్ 18: కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన అక్కసును చాటుకున్నారు. 370-అధికరణ రద్దును మరోసారి తప్పుపట్టిన ఆయన రాష్ట్రంలో అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేసిన మరుక్షణమే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు.

10/18/2019 - 22:22

పారిస్, అక్టోబర్ 18: తీవ్రమైన ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కొనే పరిస్థితి నుంచి పాకిస్తాన్ తాత్కాలికంగా బయటపడింది. పారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఐదు రోజుల ప్లీనరీలో పాక్ పట్ల కొంత ఉదారంగా వ్యవహరించింది. లష్కరే తోయిగా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాక్ సర్కారు ఆర్థిక సాయం చేస్తున్నదన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

10/18/2019 - 02:08

వాషింగ్టన్‌లో జరిగిన అంతర్జాతీయ ఇనె్వస్టర్ల సదస్సులో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయంలో ఈ సదస్సు జరిగింది

10/17/2019 - 22:46

*చిత్రం...గురువారం పిలిప్పిన్స్ రాజధాని మనీలాకు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ దంపతులకు స్వాగతం పలుకుతున్న ఉన్నతాధికారులు

10/17/2019 - 22:37

ఇస్లామాబాద్, అక్టోబర్ 17: నదీ జలాలను తమ దేశంలోకి రానివ్వకుండా భారత్ అడ్డుకొని, వాటిని మళ్లిస్తే, ఆ చర్యను దాడిగా పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పశ్చిమాన ప్రవహిస్తున్న నదులపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని పేర్కొంది. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మోదీ హిమాలయాల నుంచి నదీ జలాలు పాకిస్తాన్‌కు వెళ్లకుండా చేస్తామని హెచ్చరించడంపై పాక్ తీవ్రంగా స్పందించింది.

10/17/2019 - 04:28

శాన్‌ఫ్రాన్సిస్కో : భారత సంతతికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ తన కారులో శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో మరో ముగ్గుర్ని కూడా హతమార్చినట్టు 53 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ చెప్పడం పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.

10/17/2019 - 04:04

లండన్ : బ్రెగ్జిట్ అనిశ్చితి పరిస్థితి యూరోపియన్ మార్కెట్లను కుదిపేస్తోంది. ఎవరికివారు ఊహాగానాలు చేస్తుండడంతో స్టెర్లింగ్ విలువ తీవ్ర ఒడిదుడులకు లోనవుతోంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ యథాతథంగా అమలు చేస్తుందా అన్నది అనుమానంగా మారింది. ప్రత్యేకించి గ్రేట్ బ్రిటన్ వైఖరి అగమ్యగోచరంగా ఉండడంతో మార్కెట్ స్థిరత్వాన్ని బలపడలేకపోతోంది.

10/16/2019 - 22:47

అంకారాలో జరిగిన పార్లమెంటరీ సమావేశం అనంతరం మీడియానుద్దేశించి మాట్లాడుతున్న టర్కిస్ అధ్యక్షుడు రెసెప్ తయ్యఫ్ ఎర్డోగాన్. సిరియాలోని కుర్దిష్ దళాలు వెంటనే సరిహద్దు ఆవలికి వెళ్లాల్సిందిగా ఆయన కోరారు. సిరియాలో ప్రజాస్వామ్య పాలన కోసం జరుగుతున్న ప్రయత్నాలను టర్కీ అడ్డుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.

10/16/2019 - 22:44

టౌలోజ్‌లో జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కల్, ఎయిర్‌బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గులాం పరితో కలసి ఎయిర్‌బస్-ఏ 350 విమానాన్ని పరిశీస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి). యూరోపియన్
యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి

Pages