అంతర్జాతీయం

కోవిడ్ లక్షణాలు ఐదు రోజుల్లో పసిగట్టొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 12: కరోనా... యావత్ ప్రపంచాన్ని గడగడలాడించేస్తోంది ఈ వైరస్.. అన్ని దేశాలను హడలెత్తిస్తున్న ఈ వైరస్‌పై ఇప్పటికే ఆయా దేశాల ప్రభుత్వాలు తమ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. అయినా.. జనంలో భయం వీడడం లేదు.. అవసరమైన రక్షణ చర్యలను తీసుకొంటూనే ఉన్నారు.. ఏ చిన్న జ్వరం వచ్చినా.. జలుబు చేసినా.. దగ్గు వచ్చినా సమీపంలో ఉండే జనం సైతం బెంబేలెత్తిపోతున్నారంటే ఈ కరోనా వైరస్ తీవ్రత ఏ విధంగా ఉందో చెప్పకనే చెబుతోంది.. అసలు విషయానికొస్తే.. అసలు ఈ వ్యాధిని ఎన్ని రోజుల్లో గుర్తించవచ్చు.. ఎన్ని రోజులు చికిత్స అవసరం అన్న అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు వైద్యులు నిర్వహించి సర్వే ప్రకారం.. కేవలం ఐదు రోజుల వ్యవధిలో కరోనా వ్యాధి లక్షణాలను గుర్తించవచ్చని చెబుతున్నారు. విపరీతమైన జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ప్రారంభమైన రోజు నుంచి ఐదు రోజుల వరకు తగ్గకపోతే ఈ వ్యాధి లక్షణంగా గుర్తించవచ్చని వైద్య నిపుణులు చేసిన అధ్యయనాన్ని ‘అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే పత్రిక ప్రచురించింది. వ్యాధి లక్షణాలు ఉన్నంత మాత్రాన వైరస్ సోకినట్లు భావించనవసరం లేదని వైద్యుల అధ్యయనం మేరకు తెలుస్తోంది. ఇక 5.1 రోజుల తరువాత నుంచి వ్యాధి నిర్దారణకు రావడానికి చికిత్స అందించడానికి 14 రోజుల క్వారంటైన్ సమయం అవసరం అని తెలుస్తోంది. వైద్య నిపుణుల అంచనా మేరకు కరోనా వైరస్ -- సార్స్-కోవ్2 లక్షణాలు రోగగ్రస్థుడికి కనిపించిన తరువాత నెగిటివ్ అని తేలితే ఏ గొడవా లేదు.. పాజిటివ్ అని వస్తే మాత్రం దీనికి కచ్చితంగా 14 రోజుల వ్యవధిలో చికిత్స చేసి ఇంటికి పంపవచ్చని జాన్స్ హొప్‌కిన్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. వ్యాధి సోకిన వారిలో పదివేల మందికి ఒకలా ఉంటే 101 మందికి మరో రకంగా ఉంటుంది. పదివేల మందికి 14 రోజుల్లో చికిత్స నయం చేయగలిగితే మిగిలిన 101 మందికి మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ ఊహాన్ రాష్ట్రంలోని హుబీలో పురుడు పోసుకొంది. సార్స్-కోవ్2 2019 సంవత్సరం డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు లక్షా 19వేల మందికి సోకినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇందులో నాలుగువేల 300 మరణాలు కరోనావైరస్ కారణంగానే సంభవించాయని సమాచారం.