S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/14/2019 - 22:55

రియల్ లైఫ్ ఎక్స్‌ప్రెషన్స్‌ని కెమెరా ముందు ఎగ్జిబిట్ చేయడం అనుకున్నంత సులువు కాదు అంటోంది టాలీవుడ్ కొత్త బ్యూటీ హర్షితా చౌదరి. నటిగా తనకు ఇన్‌స్పిరేషన్ ఒకప్పటి భానుమతి, సావిత్రి, సౌందర్యలే కాదు, సీనియర్ ఆర్టిస్ట్ నిత్యమీనన్ కూడా అంటోంది. హీరోయిన్‌గా హర్షితా చౌదరి అరంగేట్రం చేస్తున్న సినిమా -తోలుబొమ్మలాట.

11/14/2019 - 22:53

థ్రిల్లర్ జోనర్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడమే కాదు, ఓ పాటకు సెమీ క్లాసికల్‌లో బాణీకట్టే అవకాశమూ -రాగల 24 గంటల్లో చిత్రంతో వచ్చిందంటున్నాడు సంగీత దర్శకుడు రఘు కుంచె. శ్రీనివాస్ కానూరు నిర్మాతగా ఈషారెబ్బా, సత్యదేవ్ లీడ్‌రోల్స్‌లో దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం -రాగల 24 గంటల్లో. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రఘు కుంచె మీడియాతో మాట్లాడాడు.

11/14/2019 - 22:51

సందీప్ కిషన్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశంలో రైటర్ రాజసింహ మాట్లాడుతూ- సినిమా మొదటినుండీ చివరివరకూ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, తప్పక విజయవంతం అవుతుందని తెలిపారు. షడ్రుచుల విందు భోజనంలా దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దారని, మంచి కథ, కథనాలు ఉన్నాయని నటుడు ప్రదీప్ తెలిపారు.

11/14/2019 - 22:50

రవితేజ, శృతిహాసన్ జోడీగా దర్శకుడు మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ఈ సందర్భంగా క్రాక్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు మలినేనికి దిల్‌రాజు, సురేందర్ రెడ్డిలు స్క్రిప్ట్ అందిస్తే, రాఘవేంద్రరావు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.

11/14/2019 - 22:48

యాక్షన్ చిత్రం విశాల్ రేంజ్‌ని పెంచుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు నిర్మాత ఆడెపు శ్రీనివాస్. హీరో విశాల్, తమన్నా జోడీగా దర్శకుడు సి సుందర్ తెరకెక్కించిన హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ -యాక్షన్. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత శ్రీనివాస్. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

11/14/2019 - 22:46

ధన్య బాలకృష్ణ, త్రిధాచౌదరి, సిద్ధిఇద్నాని, కోమలి ప్రసాద్ లీడ్‌రోల్స్‌లో బ్లాక్ అండ్ వైట్, పూర్వీ పిక్చర్స్ బ్యానర్లపై కొత్త దర్శకుడు బాలు అడుసుమిల్లి తెరకెక్కిస్తోన్న చిత్రం -అన్నకున్నదొకటి.. అయ్యిందొకటి. హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మాతలు. తాజాగా సినిమా ఫస్ట్‌లుక్‌ను నిర్మాత సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.

11/14/2019 - 22:45

రీమేక్‌ని ఓ దర్శకుడికి అప్పగించాలంటే -ఏ నిర్మాతైనా సవాలక్ష లెక్కలేసుకుంటాడు. దర్శకుడి టాలెంట్‌కు సంబంధించిన విస్తీర్ణం, వైశాల్యం, ముందువెనుకలు, ఎత్తుపల్లాలు చూసుకున్న తరువాతే.. ఆ దర్శకుడికి ప్రాజెక్టును అప్పగిస్తాడు. ఇక్కడ విషయమేంటంటే ‘స్వామి రారా’ సినిమాతో దర్శకుడిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన సుధీర్‌వర్మ -ఫస్ట్‌టైమ్ ఓ రీమేక్‌ను హ్యాండిల్ చేయబోతుండటం.

11/14/2019 - 22:43

దర్బార్‌లో కూర్చుని రజనీకాంత్ డబ్బింగ్ చెప్పేస్తున్నాడట. ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారు. రజనీ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం సంక్రాంతికి వస్తున్న దర్భార్ మీదే ఉందన్న విషయం తెలిసిందే. మురుగదాస్ తెరకెక్కిస్తోన్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫెస్టివ్ సినిమాగా రాబోతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ప్రాసెస్ మొదలైందట. ప్రస్తుతం రజనీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెపుతున్నారు.

11/12/2019 - 19:59

భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించేలా తాను మోడలింగ్ చేస్తానంటూ వచ్చిన నభా నటేష్, ఆ తరువాత కథానాయిగా మారింది. తొలుత తన మాతృభాష కన్నడంలోనే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, తెలుగులో నన్నుదోచుకుందువటే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. మోడల్‌గా చేసిన అనుభవం ఇపుడు చిత్రాలలో నటించడానికి పనికివస్తుందంటున్న ఈ అమ్మడు, తన మూడవ చిత్రం డిస్కోరాజాతో దశ తిరుగుతుందని భావిస్తోంది.

11/12/2019 - 19:58

రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, శివశంకర్ మాస్టార్ ప్రధాన తారాగణంగా భవాని శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం క్లైమాక్స్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో శ్రీరెడ్డి నటించడం విశేషం. కైపాస్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజశేఖర్‌రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Pages