S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉదయనందనవనమ్ దర్శకత్వంలో ఎంవివి సత్యనారాయణ రూపొందించిన ‘శంకరాభరణం’ చిత్రానికి సంబంధించిన థీమ్ సాంగ్‌ను హైదరాబాద్‌లో అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. నిఖిల్, నందిత జంటగా వస్తున్న చిత్రం గురించి నాగచైతన్య మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసినపుడే కొత్తగా ఉందనిపించిందని, నిఖిల్ సినిమా విడుదలవుతుందంటే ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళల్లో తానూ ఒకడినని అన్నారు.
శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రలుగా శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం -ఎఫైర్. చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక గురువారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. నిర్మాత తుమ్మలాపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ చిత్రం మొత్తాన్ని దర్శకుడు శ్రీరాజన్ తానై రూపొందించాడన్నారు. ఎఫైర్‌తో శ్రీరాజన్ పెద్ద దర్శకుల జాబితాలోకి వెళ్తాడని, హీరోయిన్లు ఇద్దరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు.
ఆశీష్ గాంధీ, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతిమోల్, మనాలీ రాధోడ్ ప్రధాన తారాగణంగా అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’. ఆడియో విడుదలలో తమ్మారెడ్డి భరద్వాజ, మధుర శ్రీ్ధర్ పాల్గొని సీడీలు విడుదలచేశారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని, ప్రస్తుతం హారర్ ట్రెండ్ సాగుతున్న దృష్ట్యా అదే తరహాలో చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం యావత్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్న చిత్రం ‘బాహుబలి’. ఉన్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో అంతే క్రేజ్‌ని దక్కించుకున్నారు దర్శకుడు రాజవౌళి, హీరో ప్రభాస్. జూలై 10న విడుదలవుతున్న ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి చిత్రాలేంటి? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.
స్వాతి ప్రధాన పాత్రలో క్రేజీ మీడియా పతాకంపై రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ రూపొందిస్తున్న ‘త్రిపుర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈనెల 15నుండి ముగింపు సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని, నెలాఖరువరకు ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు మినహా సినిమా పూర్తివుతుందని’ తెలిపారు.
రోజూ షూటింగ్‌ల్లో పాల్గొంటూనే ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మర్చిపోతాం. ఏ తప్పు ఎప్పుడు చేశామో గుర్తుండకపోవచ్చు. అందుకే మనల్ని మనం నిరంతరం చెక్ చేసుకుంటుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవంటోంది అందాలరాశి శృతిహాసన్. నన్ను నేను ఎప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాను. నాలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను చేసిన తప్పేంటో ఇతరులు చెప్పకముందే గుర్తించేసి సర్దుకుంటాను.