S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/17/2020 - 22:13

రీఎంట్రీగా పవన్ కళ్యాణ్ చేస్తోన్న రీమేక్ ‘వకీల్ సాబ్’ను మే 15న థియేటర్లకు తెస్తామంటూ కొద్దికాలం క్రితమే నిర్మాత దిల్‌రాజు ప్రకటించాడు. అనూహ్యంగా తెగబడిన కరోనా ఇంపాక్ట్‌తో -అనేక సినిమాల పరిస్థితి అటూ ఇటూ అవుతోన్న నేపథ్యంలో.. వకీల్ సాబ్ విడుదలపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మహమ్మారి కరోనా నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తూ -్ఫలిం ఛాంబర్ షూటింగ్‌లు రద్దు చేయడం తెలిసిందే.

03/17/2020 - 22:10

అల వైకుంఠపురములో -సినిమాతో పూజాహెగ్దె స్టార్‌డమ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుసగా హిట్లందుకుంటున్న క్రమంలో -ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్టందుకున్న చిత్రంతో పూజ టాప్ హీరోయిన్ స్టేటస్‌కు రీచైంది. చేతిలో టాలీవుడ్ హీరోల సినిమాలున్నా -బాలీవుడ్‌లో తన ప్రతాపం చూపించాలన్న చిరకాల కోరిపై పూజ మరోసారి ఫోకస్ పెడుతోందన్న మాట వినిపిస్తోంది.

03/17/2020 - 22:08

అలా మొదలైందంటూ -దర్శకురాలిగా కెరీర్ మొదలెట్టిన నందినీరెడ్డి ‘ఓ బేబీ’ హిట్టు తరువాత మరో హిట్టుకి రెడీ అవుతోంది. అయితే నందిలో సృజనాత్మక విషయం కంటే.. ‘ఇన్‌స్పిరేషన్’ కంటెంటే ఎక్కువంటూ అపవాదు ఎదుర్కొన్నా -తన పంథాలో ఆమె సినిమాలు చేస్తూనే వెళ్తోంది. కొరియన్ సినిమా మిస్‌గ్రానిని -తెలుగు స్క్రీన్‌కు తగిన స్క్రిప్ట్‌గా ‘రీ వర్క్’ చేయటంలో నందిని సక్సెస్ అవ్వడం తెలిసిన విషయమే.

03/16/2020 - 22:40

ఆచార్యకు జోడీగా ఎవరు ఫైనలవుతారోగానీ, రెండు రోజులకో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. చిరుకు జోడీ కనుక -దర్శకుడు కొరటాల శివ ఎవరో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం లేదు. పైగా సొంత బ్యానర్‌పై నిర్మితమవుతోన్న చిత్రం కనుక -చాలా ఈక్వెషన్స్ సాల్వ్ కావాల్సి ఉంటుంది. అందుకే -హీరోయిన్ ఎంపికపై చిత్రబృందం చాలా కసరత్తే చేస్తోంది. ముందుగా త్రిషను ఎంపిక చేసుకున్నా -చివరి క్షణంలో ఆమె ప్రాజెక్టునుంచి తప్పుకుంది.

03/16/2020 - 22:37

ఆకాష్‌పూరి హగ్‌లో టాప్‌లెస్ ట్రీటిచ్చి -కుర్రకారులో సెగరేపింది హస్తిన బ్యూటీ కేతిక శర్మ. కుర్ర హీరో ఆకాషే ఊపిరాడక లబలబలాడేంత బలంగా హత్తుకున్న కేతిక ‘రొమాంటిక్’ స్టిల్ -టాలీవుడ్‌ని కేక పెట్టించిందనే చెప్పాలి. రొమాంటిక్ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో తీవ్ర వైరలవ్వడానికి కారణం కేతికే టాప్‌లెస్ హగ్గే. తరువాత బీచ్‌లో పొట్టి నిక్కరుతో దర్శనమిచ్చి -రొమాంటిక్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంది.

03/16/2020 - 22:33

అల్లు అర్జున్ సినిమా నా పేర సూర్యతో రచయిత నుంచి దర్శకుడయ్యాడు వక్కంతం వంశీ. అనుభవజ్ఞడైన కథా రచయిత -అనుభవలేమితో దర్శకత్వం వహిస్తే సినిమా ఎలా ఉంటుందో బాక్సాఫీస్‌కు ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యిందది. ఆ సినిమా తరువాత మళ్లీ సినిమా మొదలు పెట్టడానికి బన్నీ చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అటు దర్శకుడైన వక్కంతం వంశీ క్రెడిబిలిటీ కూడా పూర్తిగా దెబ్బతింది.

03/16/2020 - 22:31

ఆడియన్స్ మీదకు ఆర్జీవీ ప్రయోగించనున్న అందమైన డ్రాగన్ -పూజా భలేకర్. మార్షల్ ఆర్ట్స్‌కు గ్లామర్‌ను మేళవించి సరికొత్త రుచిని చూపించేందుకు రెడీ అవుతున్నాడు రామ్‌గోపాల్ వర్మ. ఇండో చైనీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టులో -బ్రూస్లీని మించి భలేకర్ యాక్షన్ సీన్స్ చూపించనుందట. యాక్షన్ మాటేమోగానీ, స్క్రీన్‌మీద ఇంత గ్లామర్ చూశాక ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

03/16/2020 - 22:29

శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే -ఈ కరోనా గొడవేంటో.. అంటూ పాపం ఇద్దరు యంగ్ హీరోల ప్యాన్స్ తెగబాధ పడుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ నితిన్, నిఖిల్ పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. నితిన్ ఇప్పటికే శైలజా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. నిఖిల్ సైతం తన లవ్ పల్లవి వర్మను లైఫ్‌లోకి ఆహ్వానించేందుకు రెడీ అయ్యాడు. పెళ్లిళ్లకు ముహూర్తాలు సైతం ఫిక్సైపోయాయి.

03/16/2020 - 22:27

పెద్ద ఛాన్స్‌ల కోసం గ్లామర్ ఫొటోషూట్లకు దిగిన అందాల రాక్షసికి -ఆశించిన అవకాశం దొరికినట్టే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌తో జోడీకట్టే చాన్స్ లావణ్యకు దాదాపు ఓకే అయ్యిందట. నిఖిల్‌తో చేసిన ‘అర్జున్ సురవరం’ తన కెరీర్‌కు కలిసొస్తుందనుకుంటే, సినిమా ఒకే అనిపించుకుందే తప్ప లావణ్యకు చాన్స్‌లు తేలేకపోయింది. దాంతో లావణ్య వరుస ఫొటోషూట్లతో ఈమధ్య హడావుడి చేసింది.

03/16/2020 - 22:25

తాజ్‌మహల్ అందాల వెనుక -రాళ్లెత్తిన కూలీలెందరో. ఇండస్ట్రీలోనూ బ్లాక్‌బస్టర్/ఫ్లప్ సినిమాల వెనుక చెమటోడ్చే శ్రామికులూ ఉంటారు. కరోనా దెబ్బకు టాలీవుడ్ బందవ్వడంతో -వేలాది శ్రామికుల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సినీ కార్మికులంతా ఇప్పుడు అగమ్యగోచర స్థితినే ఎదుర్కొంటున్నారు.

Pages