ఇలా చేస్తే.. అలా హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరుమురిమి మీద పడుతుందంటే.. అరిటాకు అడ్డంపెట్టు చాలు -అన్నాడట వెనకటికో పెద్దాయన. కరోనా వైరస్‌పై టాలీవుడ్ టాప్ హీరోలిస్తోన్న సలహాల్లోనూ అంతే హీరోయిజం కనిపిస్తోంది. కరోనాపై యద్ధం చేయడమంటే -భయపడి దాక్కోవడం కాదు. దరికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో. అదేమంది పదిమంది ఆరోగ్యానికి రక్షణవుతోంది -అన్న మెసేజ్ ఇస్తున్నారు ట్రిపుల్ ఆర్ హీరోలు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం తనవంతు బాధ్యతగా -పబ్లిక్‌ని భయపెట్టే మెసెజ్‌ల విషయంలో జాగ్రత్త వహించాలంటూ సూచిస్తున్నాడు. కరోనా వైరస్ భారత్‌పైనా కనే్నసిందన్న సమాచారం రాగానే దేశం మొత్తం అలెర్టవ్వడం ఒక గొప్ప విషయమైతే -తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిరోధానికి సినీ సెలబ్రిటీలు ఇస్తోన్న ధైర్యాన్ని వంకర కన్నుతో చూడకూడదు. వైరస్ సైతం భయపడేంత విస్తృతంగా సోషల్ మీడియా ఇప్పటికే నిరోధక జాగ్రత్తలతో నిండిపోయాయి. అయితే అందరిలాగే మనవంతు బాధ్యత అంటూ ట్వీటో, కామెంటో చేసి వదిలేయకుండా స్టార్ హీరోలు తారక్, చెర్రీలు ఓ వీడియో వదలడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రభాస్ సైతం -వైరస్‌కంటే ప్రమాదకరమైన ‘ఎగ్జాగరేషన్ వైరస్’ విషయంలో జాగ్రత్త వహించమంటూ సలహానిచ్చాడు. గొప్ప విషయాన్ని మామూలోడు చెప్పేకంటే, మామూలు విషయాన్ని స్టార్ హీరో చెప్తే ఎక్కువ వైరలయ్యే రోజులు కనుక -ఈ ముగ్గురు హీరోలు చేసిన ప్రయత్నాన్ని ఆహ్వానించాల్సిందే. తెలిసిన విషయమే అయినా -హీరోలు చెప్తున్నారు కనుక.. ఎక్కువమంది ఆసక్తి చూపిస్తే, ఫలితం ఆశాజనకంగా ఉంటుందని అనుకోవాలి. పైగా -మహమ్మారి దెబ్బకు మానవాళే తుడుచుకుపోయే పరిస్థితి ఉందన్న భయానక ప్రచారాలు జరుగుతున్న టైంలో -సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే.. మన ఆరోగ్యం గడపదాటి కరోనా లోపలికొచ్చే అవకాశం లేదంటున్నారు హీరోలు. ఇక జాగ్రత్తల విషయంలో తెలిసిన ఆరు సూత్రాలే అయినా.. చెర్రీ-తారక్‌లో ఒకే వీడియాలో కనిపిస్తూ చెప్పడం ఆసక్తికరంగా ఉంది. కొత్త రూపమెత్తిన పాత కరోనా నివారణా ఔషధాలు ఇంకా అందుబాటులోకి రాలేదు కదుక, జాగ్రత్తలు పాటించటం ఒక్కటే గొప్ప తరుణోపాయమంటూ తాకర్, చెర్రీలు స్పష్టం చేయడాన్ని ‘వ్యక్తిగత’ కోణంలో చూడాల్సిన పనే లేదు. కరోనాను కంట్రోల్ చేయడానికి ఎవరికి వాళ్లు అనుసరించాల్సిన ఆరు సూత్రాలంటూ తారక్, రామ్‌చరణ్ ఏం చెప్పారంటే..
* వీలైనన్ని ఎక్కువసార్లు అరచేతులు, గోళ్ల సందుల్లో శుభ్రం చేసుకోండి. బయటికెళ్లొచ్చిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి.
* షేక్ హ్యాండ్‌లు, కలిసిన వెంటనే కౌగిలింతలను పక్కన పెట్టండి. పదే పదే కళ్లు దగ్గర, ముక్కులో, నోట్లో వేళ్లు పెట్టుకోకుండా ఉంటే వైరస్ సోకే అవకాశం తక్కువ.
* తుమ్మినపుడు, దగ్గినపుడు అడ్డుపెట్టుకోవాల్సింది అరచేయి కాదు, మోచేయి. పొడిదగ్గు, జ్వరం, జలుబులాంటివి ఉన్నవాళ్లు మాత్రం మాస్క్‌లు ధరిస్తే సరిపోతుంది.
* జనం ఎక్కువగా ఉండే చోట్లకు వెళ్లొద్దు. మంచినీళ్లే మహౌషధం. ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. గోరువెచ్చనివైతే మరీ మంచిది. ఒకేసారి తాగకుండా -కొంచెం కొంచెంగా తాగడంవల్ల మంచి ఫలితముంటుంది.
* సోషల్ మీడియాలో వచ్చే అప్‌డేట్స్‌ను అవగాహన లేకుండా షేర్ చేయొద్దు. భయపెట్టేవి కాకుండా, పనికొచ్చేవి మాత్రమే షేర్ చేద్దాం. అనవసర విషయాలతో లేనిపోని భయాలు సృష్టించటం -వైరస్‌కంటే ప్రమాదమని గుర్తించాలి.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ -కరోనా వైరస్‌పై ఏంచెప్తుందో వెబ్‌సైట్స్‌లో చూడండి. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని -వారు చేసే సూచనలు పాటిద్దాం. సలహాలు అనుసరిద్దాం. పరిశుభ్రతే -మానవాళి మనుగడకు గొప్ప అనుసరణీయ మార్గం.
ప్రభాస్ ఏం చెప్తున్నాడంటే..
కరోనా వైరస్ పరిస్థితిపై ప్రభాస్ సైతం సీరియస్‌గానే స్పందించాడు. తగు జాగ్రత్తలతో కరోనాకు దూరంగా ఉంటూనే.. అంతకంటే ప్రమాదకరమైన అనవసర విషయాలకు దూరంగా ఉండమంటూ సలహా ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ -ప్రజారోగ్యం విషయంలో మనం పెద్ద ఛాలెంజ్‌నే ఎదుర్కొంటున్నాం. అందులో సందేహం లేదు. సో, కొవిడ్ 19ను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించాలి. ఆరోగ్యం విషయంలో మనం ఆచరించాల్సింది రెండే మార్గాలు. ఒకటి -వైరస్‌కు దూరంగా ఉండటం. రెండు -వైరస్‌పై విస్తృతంగా ప్రచారమవుతున్న భయానక సమాచారానికి మరింత దూరంగా ఉండటం.. అంటూ పేర్కొన్నాడు. ప్రపంచ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని -ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలని, పని మానుకుని అనవసర భయాలను ప్రచారం చేయడంవల్ల ఫలితముండదంటూ ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం ప్రశంసించతగ్గ పరిణామం. కరోనా వైరస్ కేసులు ఒక్కటికూడా నమోదుకాని జార్జియాలో -ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ బిజీలో ఉన్నాడు. రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తోన్న ప్రభాస్ 20వ ప్రాజెక్టు హీరోయిన్ పూజా హెగ్దె, నటుడు దర్శి సైతం షూటింగ్‌లో పాల్గొంటూ.. మాస్క్‌లు ధరించని పిక్స్‌ని ఇన్‌స్టాలో పోస్ట్‌చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. -జాగ్రత్తలు పాటించమని ప్రజలకు చెప్పాల్సిన సెలబ్రిటీలు -కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
మహేష్ ఇలా..
కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోన్న ప్రస్తుత తరుణంలో -మనుషులు సమూహంగా ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు. కొంత కష్టమే అయినా పాటించటం ఉత్తమం. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ -సోషల్ లైఫ్‌ను కొంత త్యాగం చేద్దాం. సాధ్యమైనంత వరకూ ఇళ్లలోనే ఉందాం. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వైద్య నిపుణులు సూచిస్తోన్న జాగ్రత్తలు పాటిద్దాం’ అంటూ ట్విట్టర్ వేదికగా మహేష్ పిలుపునిచ్చాడు.