S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/07/2019 - 20:00

దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి పెద్దగా తెలీకుండానే అడుగుపెట్టానని, ఇక్కడకు వచ్చిన తరువాత మాత్రం సౌత్ ఇండస్ట్రీ హోంటౌన్‌లా అనిపిస్తోందని అంటోంది ముంబై బ్యూటీ దిగంగన సూర్యవంశీ. కార్తికేయ హీరోగా టిఎన్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం హిప్పీలో దిగంగన హీరోయిన్. హిప్పీలో దిగంగన పెర్ఫార్మెన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో శుక్రవారం మీడియాతో మాట్లాడింది.

06/07/2019 - 19:59

రియల్ ఇన్సిడెంట్స్‌ని స్క్రీన్‌కి ఎక్కించడంలో బాలీవుడ్‌కు ఎక్కడలేని కిక్కొస్తుంది. ఏదోక చిన్న ఇన్సిడెంట్‌ని తీసుకుని రెండున్నర గంటల కథగా అద్భుతంగా మలిచేందుకు దర్శకులు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఈ విషయంలో రెండడుగులు ముందుకేసిన దీపికా పదుకొనె వైవిధ్యమైన పాత్రను చేస్తూ సాహసం చేస్తోంది. అదే ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్ర.

06/07/2019 - 19:58

కామెడీని పండించటంలో రాజేంద్రప్రసాద్ నుంచి నేర్చుకొన్న మెళకువలు తనకు బాగా తోడ్పడ్డాయంటోంది సమంత. సీనియర్ అయిన లక్ష్మితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందట. ఈ రెండూ ‘ఓ బేబీ’తో సాధ్యమయ్యాయి అంటోంది సామ్. సమంత అక్కినేని ప్రధాన పాత్రధారిగా బి నందినిరెడ్డి తెరకెక్కించిన చిత్రం -ఓ బేబి. లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావురమేష్, నాగశౌర్య, తేజ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

06/07/2019 - 19:57

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఎక్కడా తగ్గడం లేదు. వరసబెట్టి సినిమాలు ఆడియన్స్ మీదకు వదులుతున్నాడు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా సల్మాన్ కొత్త సినిమా ‘్భరత్’ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. సల్మాన్‌కు ఈద్‌కు అవినాభావ సంబంధముంది. ఈద్ అంటే సల్మాన్ సినిమా రిలీజ్ ఉండాల్సిందే. ఏదోక సందర్భంలో తప్ప, దాదాపుగా రంజాన్‌కు రిలీజైన సినిమాలన్నీ సక్సెస్‌నే సాధించాయి.

06/07/2019 - 19:55

నా పేరు సూర్య.. సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు చేస్తోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా తాజా షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. అల్లు అర్జున్‌తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలను సక్సెస్ చేసిన త్రివిక్రమ్, హ్యాట్రిక్ ప్లాన్‌తో అడుగు లేస్తున్నాడు. పూజా హెగ్డే మరోసారి బన్నీతో జత కడుతోంది.

06/07/2019 - 19:53

మాణిక్యం మూవీస్, ఎస్‌ఎమ్‌కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్‌రావు నిర్మాతగా సిహెచ్ రవికిషోర్‌బాబు దర్శకత్వంలో బావమరదలు చిత్ర ఫేమ్ మోహన్‌కృష్ణ, హరిణిరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మళ్లీ మొదలవుతుంది రచ్చ టాగ్‌లైన్. మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేతలు కిషోర్‌రాఠీ, మహేష్‌రాఠీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

06/07/2019 - 19:52

ఆర్‌కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామానాయుడు జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఫిల్మ్‌నగర్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా నిర్వహించారని సంస్థ అధినేత డాక్టర్ రంజిత్‌కుమార్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఈ సందర్భంగా రంజిత్‌ని అభినందించారు.

06/07/2019 - 19:47

వి విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి సముద్ర దర్శకత్వంలో వి సాయి అరుణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం -జై సేన. శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణం. సినిమా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు సునీల్ లోగోను విడుదల చేశారు.

06/06/2019 - 19:58

తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో తన నాజూకు అందాలు ఎరవేసి కుర్రకారు గుండెల్లో తిష్టవేసిన కైరా అద్వానీ -తాజాగా తమిళంవైపూ చూపు తిప్పుతోందట. చేసినవి కొద్దిపాటి చిత్రలే అయినా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన కైరా -తమిళంలోనూ సత్తా చూపించాలన్న కసితో ఉందని అంటున్నారు. అందులో భాగంగానే తమిళంలో ఓ చాన్స్ అందుకుని -ఆ పాత్రతో ఆడియన్స్‌కు దగ్గరవ్వాలని కలలు కంటోందట.

06/06/2019 - 19:57

ఎన్నికల రాజకీయ వేడి పూర్తిగా చల్లబడటంతో బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. ఆన్‌స్క్రీన్ పాలిటిక్స్‌ని వేడెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. రాజకీయాల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రానికి ‘రూలర్’ టైటిల్‌నే ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను కెఎస్ రవికుమార్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.

Pages