S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/01/2020 - 23:38

రమేష్ చౌహాన్, శుభాంగి జోడీగా తుల్జా భవానీ ఫిల్మ్ సిటీ బ్యానర్‌పై లక్ష్మీ చౌహాన్ నిర్మిస్తోన్న చిత్రం -రామ్‌నాయక్. దర్శకుడు కపిల సుబ్బారావు తెరకెక్కించనున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు హైదరాబాద్‌లో లాంచనంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా హీరో రమేష్ చౌహాన్ మాట్లాడుతూ -బంజారా భాషలో నిర్మించనున్న ఈ సినిమాలో ప్రేక్షకుల మనసుతాకేలా ఐదు పాటలుంటాయి. సంగీత దర్శకుడు బోషావలి పాటలకు ప్రాణం పోశారు.

02/27/2020 - 22:16

మణిరత్నం ‘ఓకె బంగారం‘, నాగ్‌అశ్విన్ ‘మహానటి’తో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైన మలయాళీ హీరో -దుల్కర్ సల్మాన్. పెళ్లిచూపులు ఫేమ్ రీతూవర్మ జోడీగా దుల్కర్ నుంచి వస్తోన్న సినిమా -కనులు కనులను దోచాయంటే. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌కి దేసింగ్ పెరియస్వామి దర్శకుడు. వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా సినిమాని రూపొందించాయి. తెలుగులో కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తోంది.

02/27/2020 - 22:18

విశ్వక్సేన్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్’ సినిమా నేడు థియేటర్లకు వస్తోంది. వాల్‌పోస్టర్ బ్యానర్‌పై హీరో నాని నిర్మించిన సినిమా ఇది. గురువారం హైదరాబాద్‌లో చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. కార్యక్రమంలో నిర్మాత నాని మాట్లాడుతూ -నన్ను పరిశ్రమ నిలబెట్టింది. అందుకే వాల్‌పోస్టర్ బ్యానర్‌పై పరిశ్రమకు ఏదైనా చేయాలనిపించి నిర్మాతగా మారాను.

02/27/2020 - 22:13

విడుదలకు ముందే ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్రం -రాహు. శుక్రవారం సినిమా థియేటర్లకు వస్తోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా లీడ్‌రోల్ పోషించిన కృతి గార్గ్ మీడియాతో మాట్లాడారు.
* నేను రాజస్థాన్ అమ్మాయిని. వెబ్ సిరీస్‌లతో నా కెరీర్ మొదలైంది. తెలుగులో రెండో సినిమా రాహు. మంచి గుర్తింపునిస్తుందనే అనుకుంటున్నా.

02/27/2020 - 22:10

రానా దగ్గుబాటి మారిపోయాడు. ప్రొఫైలే మార్చేసుకున్నాడు. అడవిపై మానవ పంజా -కానె్సప్ట్‌తో దర్శకుడు ప్రభుసాల్మన్ తెరకెక్కిస్తోన్న చిత్రం అరణ్య. ఆ కథలో బల్దేవ్ ఇలా ఉండాలని ప్రభుసాల్మన్ చెప్పడమే తరువాయి.. కష్టపడి పెంచిన హల్క్ ఆకృతిని వదిలేశాడు. పాత్ర కోసం ఆకారాన్ని మార్చేసుకున్న ఆర్టిస్టులు ఇంతకుముందు లేకపోలేదు.

02/27/2020 - 22:08

లక్ష్మీ సౌభాగ్యవతి అంటే ఇలా ఉండాలన్నంతగా -అంజలి పాత్రతో రెండేళ్ల క్రితం తెలుగు ఆడియన్స్ కళ్లను కట్టిపడేసింది పంజాబీ బ్యూటీ రుహానీ శర్మ. హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చి.ల.సౌలో రుహానీ పోషించిన అంజలి పాత్రను అంత సులువుగా మర్చిపోలేం. అయితే, టాలీవుడ్ స్క్రీన్‌మీద అలాంటి పాత్రలు అరుదు కనుక -పక్కింటి పిల్ల పాత్రలు రుహానీనీ మళ్లీ పలకరించలేదు.

02/27/2020 - 22:06

స్ర్తి జాతికి జరుగుతోన్న అన్యాయంపై సందేశాత్మకంగా నిర్మించిన ‘స్వేచ్ఛ’లాంటి చిత్రాల అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉందని మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి అన్నారు. గాయని మంగ్లీ లీడ్‌రోల్ చేసిన ‘స్వేచ్ఛ’ ప్రీరిలీజ్ వేడుకలో తీగల మాట్లాడుతూ -మంగ్లీ మంచి సింగర్‌గా తెలుసు. స్వేచ్ఛతో మంచి నటి అనిపించుకుంటుందని భావిస్తున్నా అన్నారు.

02/27/2020 - 22:04

రాజావారు రాణీవారు చిత్రంతో మంచి పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం రెండో సినిమా మొదలుపెట్టాడు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ప్రాజెక్టు మార్చి 2నుంచి సెట్స్‌పైకి వెళ్తోంది. టాక్సీవాలాతో ఆడియన్స్‌ని మెప్పించిన ప్రియాంక జువాల్కర్ ఈ ప్రాజెక్టులో కిరణ్‌తో రొమాన్స్ చేయనుంది. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు.

02/27/2020 - 22:03

అందాల రాక్షసితో మంచి పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్నాడు నవీన్‌చంద్ర. తర్వాత చిన్నా చితకా హీరో పాత్రలు చేస్తూనే -క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా సినిమాలు చేశాడు. కొత్తతరం విలన్లను టాలీవుడ్ వెతుకుతున్న టైంలో -నవీన్‌చంద్రకు మంచి చాన్స్‌లే వచ్చాయి.

02/27/2020 - 22:01

నితిన్, రష్మిక మండన్న జోడీగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ ఘన విజయం సాధించటం తెలిసిందే. నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా విజయోత్సవాన్ని 29న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.

Pages