పాయల్.. 5 డబ్ల్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐపీఎస్ అవతారమెత్తిన పాయల్ రాజ్‌పుత్ సినిమా టైటిల్ -5 డబ్ల్యూస్ (ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు). ‘సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు’ అనేది ఉపశీర్షిక. ప్రణదీప్ ఠాకోర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కైవల్య క్రియేషన్స్‌పై యశోద ఠాకోర్ నిర్మిస్తోన్న చిత్రమిది. తాజాగా హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ -నా కెరీర్‌కు ఈ సినిమా ఓ కొత్త టర్న్. టాలెంటెడ్ టీంతో కలిసి ఐపీఎస్‌గా ఛాలెంజింగ్ రోల్ చేశా. ప్రణదీప్ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే ఓకే చేశా. ఈ పాత్రలో నాకు విజయశాంతి స్ఫూర్తి. ఇమేజ్‌ని బ్రేక్ చేసే సినిమా -5డబ్ల్యూస్ అన్నారు. దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ -క్రైమ్ ఇనె్వస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. ఇనె్వస్టిగేషన్‌కు ప్రధానం 5డబ్ల్యూస్ కనుక టైటిల్ అదే పెట్టాం. ఓ పోలీస్ ఆఫీసర్ స్ఫూర్తిగా రాసిన కథ కోసం చాలామంది టాప్ పోలీస్ నుంచి వివరాలు సేకరించాను. హ్యూమన్ వాల్యూస్, సెంటిమెంట్స్‌ను టచ్ చేసే సినిమా ఇది. త్వరలో పూర్తిచేసి వేసవిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు. నిర్మాత యశోద ఠాకోర్ మాట్లాడుతూ -ఒకరకంగా నేను స్ర్తివాదిని. నేను చేసే పనిలో, ఆలోచనల్లో ఎప్పుడూ మహిళా సాధికారత ఉంటుంది. నా భర్త తీస్తున్న సినిమా మహిళల గురించి, స్ర్తిశక్తి గురించి అవ్వడం గర్వంగా ఉంది అన్నారు.