ప్రతి పుష్ప’మెవరో?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నాలుగైదు భాషల్లో విడుదలయ్యేవన్నీ పాన్ ఇండియా సినిమాలే అంటున్నారు కనుక -‘పుష్ప’నూ అదే రేంజ్లో విడుదల చేసే ఆలోచన చేశారు మేకర్లు. అందుకే ఫస్ట్‌లుక్ విడుదల టైంలోనే ఐదు భాషల్లో సినిమా విడుదల చేస్తామంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ ముందునుంచీ ‘హై థాట్’తోనే ఉన్నాడు. అందుకే -బోర్డులోకి హై ప్రొఫైల్డ్ ఆర్టిస్టుల్నే ఎంపిక చేస్తున్నాడన్న మాట వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం రంగస్థలంతో బ్లాక్‌బస్టర్ కొట్టిన సుక్కూ.. ఈ ఏడాది సెనే్సషన్ హిట్టందుకున్న బన్నీతో చేస్తున్న సినిమా కనుక -ప్రాజెక్టుపై భారీ ఎక్స్పెక్టేషనే్స ఉన్నాయి. సో, దర్శకుడు సుకుమార్ పాన్ ఇండియా స్టేటస్‌ను దృష్టిలో పెట్టుకునే విలన్‌ను ఎంపిక చేసే పనిలో పడ్డాడంటున్నారు. ఇప్పుడున్న వాతావరణంలో ప్రాజెక్టు రేంజ్ పెంచేందుకు -కథకు సూటయ్యే బాలీవుడ్ హీరోని విలన్‌గా చూపించే ఆలోచన చేస్తున్నాడట. సంజయ్‌దత్, సునీల్‌శెట్టి, జాకీష్రాఫ్లాంటి స్టాల్వాల్ట్స్లో ఒకరిని ఒప్పించేందుకు సుకుమార్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. స్మగ్లింగ్ కథలో కీలక పాత్ర పోషించే నెగెటివ్ పోలీస్ పాత్ర కోసం ఇప్పటికే విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నా -ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడన్నది తాజా సమాచారం. కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ ఇంపాక్ట్‌తో షూటింగ్ ఆలస్యమవ్వడంతో -తదుపరి కమిట్మెంట్స్ వత్తిడితో సేతుపతి సైడయ్యాడని అంటున్నారు. సేతుపతి పాత్ర కోసం బాబీసింహాను దర్శకుడు సుక్కూ ఎంపిక చేసుకోవచ్చనీ వినిపిస్తోంది. ఇక మెయిన్ విలన్‌గా సుక్కూ ఎవరిని ఒప్పిస్తాడన్నదే ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ లిఫ్ట్ చేసిన వెంటనే కేరళలో రెండో షెడ్యూల్ నిర్వహించేందుకు మేకర్లు ప్రిపరేషన్స్ పూర్తి చేశారని అంటున్నారు.