అరెరే.. అనూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్ కాలిపోయిన తరువాత -కాళ్లు కడుక్కున్నా ప్రయోజనం ఉండదంటోంది అందగత్తె అనూ ఇమ్మాన్యుయేల్. తొలినాళ్లలో వేసిన తప్పటడుగులు -కెరీర్ రూట్‌నే మార్చేసిందన్న బాధతో చెప్తోన్న మాటలివి. ‘మజ్ను’కి జోడీగా టాలీవుడ్ తెరపై తొలిసారి తళుక్కుమంది అనూ బ్యూటీ. నేచురల్ స్టార్ నానితో జోడీకట్టాక -కుర్ర హీరో రాజ్‌తరుణ్‌తో ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా చేసింది. ఆమె నాజూకుతనానికి తెలుగు ఆడియన్స్ కనెక్టవ్వడంతో -గోపీచంద్‌తో ఆక్సిజన్, పవన్ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసిలాంటి చిత్రాలుపడ్డాయి. నిజానికి త్రివిక్రమ్ చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అలాంటిది -అనూ కాలం కలిసిరాక ‘అజ్ఞాతవాసి’ డిజాస్టరైంది. ఆ తరువాత కూడా అల్లు అర్జున్‌కు జోడీగా ‘నా పేరు సూర్య..’లో చాన్స్ దక్కించుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో -ఆమెపై ఐరెన్ లెగ్ ముద్ర వేసేశారు. అదే టైంలో నాగచైతన్యతో చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’కీ ఫ్లాప్ టాక్ రావడంతో.. తెలుగులో అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్‌కు అక్కడితో బ్రేక్ పడింది. అందం, అభినయ సామర్థ్యమున్నా -అవకాశాలు పలకరించటం లేదన్న గందరగోళంలో ‘గీత గోవిందం’ చిత్రంలో గెస్ట్ రోల్ చేయడం మరీ చేటైంది ఆమె కెరీర్‌కు. పెద్ద స్టార్లతో చేసిన సినిమాలు ఫ్లాపై, గెస్ట్‌రోల్‌గా చేసిన సినిమా సెనే్సషల్ హిట్టవ్వడంతో -సెంటిమెంట్ ఇండస్ట్రీలో అనూని అదే కోణంలో చూడ్డం మొదలెట్టారు. ‘అనుభవం లేని టైంలో నా పాత్ర వరకే వినేదాన్ని. కథ పూర్తిగా వినకుండా ఒప్పుకున్న ప్రాజెక్టులే ఎక్కువ. అదే చేటైంది. అవగాహన పెరిగే సరికి -కథ మొత్తం వినాల్సిన అవసరమే రావడం లేదు’ అంటూ తనపై తనే సెటైర్లు వేసుకుంటోందట అనూ బేబీ. తాజాగా -బెల్లంకొండ శ్రీనుతో సంతోష్ శ్రీనివాస్ చేస్తోన్న ‘అల్లుడు అదుర్స్’ ప్రాజెక్టులో విలన్ వైఫ్ క్యారెక్టర్ చేస్తోందన్న సమాచారం.. అనూ అభిమానులకు చేదైన వార్తే. ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ క్యారెక్టర్ చేస్తుంటే -హీరో శీనుకు జోడీగా యంగ్ బ్యూటీ నభానటేష్ రొమాన్స్ చేయనుంది. సో, అనూ ఇక ఇలాంటి క్యారెక్టర్లకే పరిమితమవుతుందో? పిసరంత లక్ లక్కలా అంటుకుని.. -కెరీర్‌లో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంటుందో చూడాలి.