S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/06/2019 - 19:45

సత్యదేవ్, ఇషా రెబ్బ హీరో హీరోయిన్లుగా ప్రముఖ కథానాయకుడు శ్రీరామ్, పైసా వసూల్ ఫేం ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్ల నటించిన చిత్రం రాగల 24 గంటల్లో. ఈ చిత్రానికి శ్రీనివాస్ కానూరి నిర్మాత. ఢమరుకం శ్రీనివాస్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ విభిన్నంగా జరిగింది. రెండు పోస్టర్లను విడుదలచేసింది చిత్ర యూనిట్. మొదటి పోస్టర్‌ను సి. కల్యాణ్ విడుదల చేశారు.

09/06/2019 - 19:43

‘బిచ్చగాడు’ హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు విజయ్ ఆంటోనీ. ఏ సినిమాతో వచ్చినా ఏదోక వైవిధ్యం ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించాడు. అదే విజయ్ ఆంటోనీ హీరోగా మరో వైవిధ్యమైన సినిమా రూపుదిద్దుకుంటోంది. తమిళంలో సినిమా రూపుదిద్దుకుంటున్నా, తెలుగు హీరో కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం కనుక -ఇక్కడి ఆడియన్స్‌ను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది.

09/06/2019 - 19:42

సక్సెస్‌పరంగా ఆర్‌ఎక్స్ 100 దగ్గరే ఆగిపోయిన హీరో కార్తికేయ -కెరీర్‌పరంగా మరో మైలురాయి అధిగమించేందుకు కొత్త ప్రయత్నం మొదలెట్టాడు. ఆర్‌ఎక్స్ తరువాత చకచకా అవకాశాలు అందుకుని చేసిన సినిమాలు -కెరీర్‌ను ముందుకు కదల్చలేకపోయాయి. ఒక్కసారిగా వచ్చిన ఫ్యాన్‌మెయిల్ సైతం క్రమంగా మాయమవుతుండటంతో -కార్తికేయ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

09/06/2019 - 19:41

రజిత్, త్రిషాలాసా జంటగా సుంకర సత్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం -్ధకీ. ఎనుగంటి దర్వకత్వం వహించిన సినిమా టీజర్, బ్యానర్ లోగోను దర్శకుడు వివి వినాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వినాయక్ మాట్లాడుతూ -సుంకర బ్రదర్స్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సోదరుడికి మంచి లైఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో బ్యానర్ స్టార్ట్‌చేసి సినిమాకు సిద్ధపడటం గొప్ప విషయం.

09/05/2019 - 20:10

అల.. వైకుంఠపురములో -అల్లు అర్జున్ ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై కొత్త చర్చకు తెరలేపాడు. పోష్ ఏరియా.. లగ్జరీ కారు బ్యాక్‌డ్రాప్.. కాస్ట్లీ సూట్‌లో చీప్ స్టూల్‌మీద మాస్ స్టయిల్లో కూర్చున్న బన్నీ. అతని నోట్లో బీడీ. మర్యాదగా వొంగి ముట్టిస్తున్న సెక్యూరిటీ గార్డ్. ఇదీ ఫస్ట్‌లుక్. దీన్ని అనలైజ్ చేసుకుంటే -దర్శకుడు త్రివిక్రమ్ మళ్లీ ఏదో మ్యాజిక్ చేయబోతోన్న విషయాన్ని అంచనా వేయొచ్చు.

09/05/2019 - 20:09

ప్రియుడినుంచి దూరమైన తరువాత గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెడుతోంది. సైరా తరువాత చిరు-కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రాజెక్టులో ఇలియానాకు చోటు దక్కొచ్చట. చరణ్ టీం ఆమెను అప్రోచ్ అవ్వడం, ఆమె ఓకే చెప్పడం జరిగిందని టాక్. పాత్రోచిత దేహ సౌందర్యం కోసం ఇలియానా కసరత్తులు మొదలెట్టిందన్న కథనాలూ లేకపోలేదు.

09/05/2019 - 20:07

ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ నా ఆలోచనలకు ప్రతిరూపమే. ఒక ఆలోచనను కమర్షియల్ ఫార్మాట్‌కు అన్వయించి కథగా మలచుకున్న చిత్రాలనే చేశాం. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నామన్న ఇమేజ్ రావడం ఆనందంగా ఉంది. ఇకపై -మంచి కంటెంట్‌తో దర్శకులు ముందుకొచ్చినా, అలాంటి ప్రాజెక్టులూ చేసే ఆలోచన చేస్తున్నా.

09/05/2019 - 20:05

నందితశే్వత ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం -అక్షర. షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమానుంచి వచ్చిన టీజర్, టైటిల్‌సాంగ్‌కు మంచి ఆదరణ రావడం తెలిసిందే. విడుదలకు సిద్ధమైన సినిమాకు సంబంధించి నిర్మాతలు సురేష్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ వివరాలందిస్తూ -విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, చక్కని పరిష్కారం చూపించే ఇతివృత్తమే అక్షర అన్నారు.

09/05/2019 - 20:04

క్రోకోడైల్ క్రియేషన్స్, లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం -రామచక్కని సీత. శ్రీహర్ష మండా దర్శకుడు. విశాలాలక్షి మండా, జిఎల్ ఫణికాంత్ నిర్మాతలు. ఇంద్ర, సుక్రుతా వేగల్ హీరో హీరోయిన్లు. సినిమా ట్రైలర్ గురువారం బి గోపాల్ చేతులమీదుగా విడుదల చేశారు. గోపాల్ మాట్లాడుతూ -మంచి టైటిల్‌తో వస్తున్న సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు.

09/05/2019 - 20:02

వరల్డ్ క్లాస్ ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బయోగ్రఫీని -దీపికా పదుకొనె చేయనుందా? నిర్మాత సోనూసూద్ ఆలోచనలు ఎంత భారీగా ఉన్నాయో తెలీదుకానీ, దీపిక అయితే కథకు న్యాయం జరుగుతుందన్న భావన వ్యక్తం చేస్తోంది పీవీ సింధు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సింధుకు ఈ ప్రశ్న ఎదురైనపుడు -‘నిజానికి సినిమాకు సంబంధించి నాకేమీ వివరాలు తెలీవు. సోనూసూద్‌ను కలిసిన తరవాతే స్పష్టత వస్తుందేమో’నంటూ సమాధానమిచ్చింది.

Pages