S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/06/2019 - 19:56

ఘట్టమనేని నట వంశంనుండి తెలుగు తెరకు పరిచయమైన సుధీర్‌బాబు తననితాను నటుడిగా మలుచుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే పాత్రల్లో నటించి మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. సుధీర్‌బాబు అనగానే టాలీవుడ్‌లో ముందు గుర్తొచ్చేది అతని ఫిజిక్. 2018లో సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాలతో టైమ్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో టాప్ 15లో సుధీర్‌బాబు నిలబడడం విశేషం.

06/06/2019 - 19:54

మహర్షి సక్సెస్ అల్లరి నరేశ్‌కు మంచి కిక్కే ఇచ్చినట్టుంది. చాలాకాలంగా చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ లేకపోవడంతో డల్‌గా కనిపిస్తున్న నరేశ్, మహర్షి మూవీ తరువాత ప్రెష్‌గా కనిపిస్తున్నాడు. మహేష్‌బాబు స్నేహితుడు రవి పాత్రకు నరేష్ ఒకవిధంగా ప్రాణం పోశాడనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి మరో ఎమోషనల్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడట నరేశ్.

06/06/2019 - 19:53

వైవిధ్యమైన కథలు.. వాటిల్లో విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు రానా. ఆహార్యానికి తగిన కథల్ని ఎంచుకుంటోన్న విషయం ఇప్పటి వరకూ చేసిన సినిమాలు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. తాజాగా రానా మరో వైవిధ్యమైన కథతో సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆ ప్రాజెక్టు -విరాటపర్వం. అటు తమిళం, ఇటు బాలీవుడ్ చిత్రాలు చేస్తూనే -తెలుగు ప్రాజెక్టుతో సెట్స్‌పైకి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడట.

06/06/2019 - 19:51

తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగులో తొలి సీజన్‌కు హోస్ట్‌గా చేసిన ఎన్టీఆర్ తన డాన్స్ మరియు హావభావాలతో ఆ సీజన్‌ను సూపర్ సక్సెస్ చేశారు. రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా, దానికి హోస్ట్ ఎవరు అనేదానిపై కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి.

06/06/2019 - 19:50

ప్రముఖ నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత స్వర్గీయ డా.దగ్గుబాటి రామానాయుడి విగ్రహావిష్కరణ
కార్యక్రమం ఫిలింనగర్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విగ్రహాన్ని
ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు సినీరంగ ప్రముఖులు ప్రాల్గొన్నారు.

06/06/2019 - 19:48

అచ్చమైన తెలంగాణ ప్రేమకథ -దొరసాని. సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా, సేనే్సషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతోన్న చిత్రమిది. దొరల గడీల నేపథ్య కాలంనాటి ప్రేమకథకు సంబంధించి తాజాగా టీజర్ విడుదలైంది. ‘వీనికేం తెల్వద్ పీకద్.. దొరసానులెప్పుడైనా బయటికొత్తార్రా’ అంటూ టీజర్‌లో వినిపించిన డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

06/06/2019 - 19:45

మహానటి ఫేం బేబి సాయితేజస్విని, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రలను పోషిస్తున్న చిత్రం ఎర్రచీర. బేబి ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతకంపై చెరువుపల్లి సుమన్‌బాబు స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథులుగా నటకిరీటి రాజేంద్రప్రసాద్, దర్శకుడు అనీల్ రావిపూడి ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు.

06/05/2019 - 20:47

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- ‘నా పేరు సూర్య..’ తరువాత చేసే మూవీకి దర్శకత్వం వహించే ఛాన్స్ తనకు కలిసొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌కే అప్పగించాడు. తనకోసం ఎదురుచూసిన విక్రమ్ కె కుమార్, సుకుమార్లను కాదని బన్నీ, మాటల మాంత్రికుడితో జతకట్టాడు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో మూవీ తెరకెక్కనుందని సమాచారం.

06/05/2019 - 20:46

పవర్‌ఫుల్ పాత్రలో విజయశాంతిని స్క్రీన్‌మీద చూపించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ఉవ్విళ్లూరుతున్నాడట. మహేశ్ 26వ ప్రాజెక్టుకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. విలన్ పాత్ర పోషించనున్న జగపతిబాబును సమర్థంగా ఎదుర్కోగలిగే ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో విజయశాంతి క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడని తెలుస్తోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ప్రాజెక్టులో మహేశ్‌తో రష్మిక మండన జోడీకడుతోంది.

06/05/2019 - 20:45

‘మహానటి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్, తర్వాత తెలుగు పరిశ్రమవైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈమధ్యే ఒక తెలుగు ప్రాజెక్టుకు సైన్ చేసిన ఆమె, ఇప్పుడు మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే ‘మన్మథుడు-2’. సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటిస్తున్న సినిమాలో కీర్తిసురేష్ కీలక పాత్ర చేస్తోందట. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ఆమె పాల్గొంటోంది.

Pages