S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/01/2019 - 21:46

రథం ఫ్రేమ్ గీతానంద్, శ్రీహాన్, రోనిత్‌రెడ్డి, సుజిత్, అన్షులా, జెన్నీఫర్ హీరో హీరోయిన్లుగా శ్రీపిక్చర్స్ బ్యానర్‌పై బోయ్స్ సినిమా ప్రారంభమైంది. దర్శకుడు దయానంత్ తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని నేహా శర్మ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశంలో కెఎల్ దామోదర్ ప్రసాద్ క్లాప్‌కొట్టి దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. నిర్మాత రాజా కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

09/01/2019 - 21:45

అడివి శేష్, రెజీనా కాసాండ్రా, నవీన్‌చంద్ర ప్రధాన తారాగణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్‌పై రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ -ఎవరు. దర్శకుడు వెంకట్ రామ్‌జీ తెరకెక్కించిన సినిమా ఆగస్టు 15న విడుదలై విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.

09/01/2019 - 21:43

అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రలుగా దర్శకుడు రామ్ తెరకెక్కించిన తమిళ సినిమా -తారామణిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డివి వెంకటేష్, ఉదయ్‌హర్ష వడ్డెల్ల సంయుక్తంగా అందిస్తున్నారు. సెప్టెంబర్ 6న సినిమా విడుదల నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత కెయల్ దామోదరప్రసాద్ మాట్లాడుతూ -ట్రైలర్ చూశాక ఇదొక రియలిస్టిక్ ఫిల్మ్ అని అర్థమైంది.

08/30/2019 - 21:09

మహిళా ప్రాధాన్యతా చిత్రాలు.. ముఖ్యంగా హాస్య ప్రధానాంశ సినిమాలకు సక్సెస్ గ్రాఫ్ తక్కువ. చాలామంది హీరోయిన్లు ప్రయోగాలు చేసి బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యారు. మహిళా ప్రాధాన్యతా సినిమా అనగానే ఒకప్పుడు విజయశాంతి, తరువాత అనుష్కశెట్టి ఇలా ఏ కొద్దిమంది పేర్లో వినిపిస్తుంటాయి. తమన్నా, తాప్సీ, అమలాపాల్‌లాంటి బ్యూటీలూ ప్రయోగాలు చేసినా -సక్సెస్ రేటు హారర్ కామెడీలకే పరిమితమైంది.

08/30/2019 - 21:08

అప్రతిహత విజయాలతో పీవీ సింధు ముందుకు సాగుతుంటే -ఆమె స్క్రీన్ స్టోరీలో క్లైమాక్స్ ఏంరాయాలో అర్థంకాక చిత్రబృందం దిక్కులు చూస్తుంది. భారత మహిళా బ్యాడ్మింటన్‌కు సైనానెహ్వాల్ ఏకైక దిక్కు అనుకుంటున్న తరుణంలో -అనూహ్యంగా దూసుకొచ్చిన మెరుపుతునకే పీవీ సింధు. అప్పుడెప్పుడో ప్రకాశ్ పదుకొనె సాధించిన అసాధ్య రికార్డులను సింధు అనూహ్యంగా తిప్పి రాస్తుండటంతో -ఆమె బయోగ్రఫీలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి.

08/30/2019 - 21:06

బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ -వార్. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై బ్యాంగ్ బ్యాంగ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. రెబెల్ ఆర్మీ అధికారి కబీర్‌గా హృతిక్ రోషన్, అతన్ని మట్టుబెట్టేందుకు ప్రయత్నించే మరో సైనికాధికారి ఖలీల్ పాత్రలో టైగర్ ష్రాప్ నటిస్తున్నారు.

08/30/2019 - 21:04

ఆడియన్స్‌కి కొత్త థ్రిల్ ఇవ్వాలంటే -పాత ఇమేజ్‌ని చెరిపేయాలి. చాలామంది హీరోలు చేసే పనే. మంచు మనోజ్ కూడా అదే ఫాలో అయిపోయాడు. బరువు తగ్గి బాడీని మార్చుకున్నాడు. తనలోని మార్పుని చూపించేందుకు సన్నద్ధమవుతున్నాడు. నిజానికి మనోజ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లవుతుంది. సినిమాలకు దూరంగావుంటున్నా, ట్విటర్ వేదికగా టచ్‌లోనే ఉన్నాడు.

08/30/2019 - 21:01

అటు గ్యాంగ్‌లీడర్. ఇటు వాల్మీకి. రెండు ఆడియన్స్‌లో ఆసక్తిరేపిన చిత్రాలే. రెండూ ఒకేసారి థియేటర్లకు వస్తే -ఏదోక సినిమా నష్టపోయే ప్రమాదం ఉండొచ్చు. సో, సమన్వయంతో వ్యవహరించి ఒక సినిమాకు వెనక్కి జరుపుకుంటే మంచిదన్న ప్రతిపాదన నిర్మాతల ముందుకొచ్చింది. వారం అటూ ఇటూ వస్తే ఇబ్బందేముందున్న సమన్వయ ఆలోచనతో -వాల్మీకి వారం వెనక్కి జరిగాడు.

08/30/2019 - 20:55

రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ తోడైతే -అవి మరింతగా రాణిస్తాయి. అలాంటి కొన్ని ఆసక్తికర సంఘటనలే కథాంశంగా వస్తోన్న సినిమా -పలాస 1978. పస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. రఘు కుంచే సంగీతం సమకూర్చిన సినిమా నుంచి ఓ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. లక్ష్మీభూపాల రాసిన ఈ పాటను ఎస్పీబీ, పల్లెకోయి పాడారు.

08/30/2019 - 20:49

గోపీచంద్, మెహరీన్ జోడీగా తిరు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం -చాణక్య. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవడంతో -ఇటలీ, మిలాన్ ప్రాంతాల్లో పాటల షూటింగ్ అవుతోందని చిత్రబృందం చెబుతోంది. కొరియోగ్రాఫర్ రాజు సుందరం నేతృత్వంలో ఇటలీ, మిలాన్ ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేస్తున్నారు.

Pages