S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/26/2020 - 22:16

ప్రభాస్‌తో నాగ్‌అశ్విన్ సినిమా

02/26/2020 - 22:15

నలుగురు అపరిచితులు. వేల కిలోమీటర్ల ప్రయాణం. ఈ సుదీర్ఘ ప్రయాణం ఎటు? ఎందుకు? వాళ్లకెదురైన అనుభవాలు..? ఈ ప్రశ్నలకు సమాధానాలే ప్రధాన కానె్సప్ట్‌గా సుమంత్ అశ్విన్ సినిమా మొదలైంది. గురుప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత జి మహేష్ తొలి సినిమా నిర్మిస్తున్నాడు. నలుగురు అపరిచితులుగా సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని కనిపించనున్నారు.

02/26/2020 - 22:13

అనుష్క నుంచి రెండేళ్ల క్రితం భాగమతి వచ్చింది. తరువాత చిరంజీవి ‘సైరా’లో తళుక్కున మెరవడం తప్ప -అనుష్క నుంచి మరో సినిమా లేదు. వెయిట్‌లాస్ ప్రోగ్రాంలో బిజీగా ఉండటంతో -అనుష్క చాలాకాలం ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. తాజాగా ఆమె లీడ్‌రోల్ చేసిన నిశ్శబ్ధం సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు అంతకంతకూ ఆలస్యం అవుతుండటం పట్ల అనుష్క అసహనానికి గురవుతోందన్న కథనాలు వస్తున్నాయి.

02/26/2020 - 22:12

రాజశేఖర్ ద్విపాత్రాభినయంగా దర్శకుడు కన్మణి తెరకెక్కించిన చిత్రం -అర్జున. నట్టీస్, క్విట్టీ ఎంటర్‌టైన్‌మెంట్లపై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తోన్న చిత్రమిది. మరియం జకారియా హీరోయిన్. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -మార్చి 6న అర్జున థియేటర్లకు వస్తున్నాడు. తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

02/26/2020 - 22:10

ఎదురులేకుంటే అదృష్టం.. ఎదురుదెబ్బ తగిలితే గడ్డుకాలం -అన్నది ఇండస్ట్రీ సెంటిమెంట్. రెంటికీ కొలమానం కాలమే అయినా.. మంచీ, చెడుగా విశే్లషించటం పరిపాటి. ఇండస్ట్రీ లెక్కల్లో చూస్తే మాత్రం హీరో నాగశౌర్యకు బ్యాడ్‌టైం నడుస్తోంది. తను రాసుకున్న అశ్వథ్థామ పోయింది. తనకు హిట్టునిచ్చిన దర్శకుడు వెంకీతో గొడవొచ్చింది. తనకు జోడీగా నటించిన మెహ్రీన్ కౌంటర్ల మీద కౌంటర్లేస్తోంది. వెరసి -శౌర్య టైం బ్యాడ్డైంది.

02/26/2020 - 22:07

అఖిల్ అక్కినేని హీరోగా జిఎ2 పిక్చర్స్‌పై బొమ్మరిల్లి భాస్కర్ తెరకెక్కిస్తోన్న చిత్రం -మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. మార్చి 2న సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్టు నిర్మాతలు బన్నీ వాసు, వాసువర్మ తెలిపారు. అఖిల్, పూజా హెగ్దెలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే.

02/26/2020 - 22:06

రెండేళ్ల గ్యాప్ తీసుకున్నా -రీఎంట్రీలోనే పవన’వేగం చూపిస్తున్నాడు కల్యాణ్. పాలిటిక్స్‌ని బ్యాలెన్స్ చేస్తూనే -ప్రొఫెషనల్ కెరీరిజంపై సీరియస్ ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తోంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలకు నాలుగేళ్ల టైంవుంది కనుక -రెండేళ్లు సినిమాలకు కేటాయించి.. రాజకీయాలను నడిపించే కనీస ఆర్థిక సామర్థ్యం సమకూర్చుకోవాలన్న యోచనతో ఉన్నట్టు పవన్ చెప్పకనే చెబుతున్నాడు.

02/26/2020 - 22:04

తనదైన పెర్ఫార్మింగ్ ఫార్మాట్ కారణంగా ప్రయోగమనిపించకున్నా.. రవితేజ చాలా ప్రయోగాలే చేశాడు. నా ఆటోగ్రాఫ్ విత్ స్వీట్ మెమరీస్.. సారొచ్చారు... శంభో శివ శంభోలాంటి సినిమాలను ప్రయోగాల కోణంలోనే చూడాలి. మధ్యలో కలిసొచ్చిన కమర్షియల్ మాస్ సినిమాలు చేసిన రవితేజ.. మళ్లీ అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కోరాజా చిత్రాలతో ప్రయోగాలే చేశాడు. కానీ కలి సిరాలేదు. మళ్లీ కెరీర్ కాలింది.

02/26/2020 - 22:02

ప్రేమ-పెళ్లి విషయంలో కల్యాణి ప్రియదర్శన్ కచ్చితమైన నిశ్చితాభిప్రాయంతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ‘ప్రేమిస్తా. ప్రేమ పెళ్లే చేసుకుంటా. కాకపోతే, ప్రేమలో అయితే ఇంకా పడలేదు. దానికోసం ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదు. నా లవ్ మ్యారేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులో సందేహం కూడా లేదు’ అంటోందట కల్యాణి. ఆమె నిశ్చితాభిప్రాయం విన్న ఇండస్ట్రీ జనానికి మాత్రం గూస్‌బంప్స్ వస్తున్నాయి.

02/25/2020 - 22:08

సాయిపల్లవి పెర్ఫార్మెన్స్‌కి ఫిదా అయిన ఆడియన్స్ -ఓవర్‌నైట్‌లో స్టార్ చేసేశారు. సాయినుంచి మళ్లీ అలాంటి సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. ఫిదా తరువాత చేసిన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సక్సెస్ నాని అకౌంట్‌లోకి వెళ్లిపోయింది. రెండేళ్ల క్రితం శర్వాతో చేసిన పడి పడి లేచెమనసు సాయి కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. సో, తన కెరీర్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తెస్తాయన్న ఆశలు ఉన్న రెండు సినిమాలపైనే పెట్టుకుంది.

Pages