మళ్లీ.. ఇద్దరూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, సాయిపల్లవి -ఇద్దరూ మంచి ఫెర్ఫార్మర్లే. వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నవాళ్లే. వీళ్లిద్దరూ చేసిన ‘పడి పడి లేచె మనసు’ కంటెంట్ పరంగా ఆడియన్స్‌కి రుచించకున్నా -వీళ్ల కెమిస్ట్రీ విషయంలో ఎక్కడా అసంతృప్తికి లోనవలేదు. దీంతో మరోసారి శర్వా, సాయిపల్లవి స్క్రీన్ రొమాన్స్‌ని ఆడియన్స్‌ని రుచి చూపించనున్నారు. వీళ్లిద్దరి క్యూట్ కాంబినేషన్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన లవ్‌స్టోరీ ఇద్దరికీ కనెక్టవ్వడంతో -గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నది లేటెస్ట్ టాక్. ప్రస్తుతం కిషోర్ తిరుమల -హీరో రామ్ ‘రెడ్’ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. రెడ్ థియేటర్లకు వచ్చిన తరువాత శర్వా, సాయిపల్లవి చేయబోయే ప్రేమ కథనే సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. పడి పడి లేచె మనసు చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరే ఈ ప్రాజెక్టునూ నిర్మించనున్నాడట. ఈ క్యూట్ పెయిర్‌కు తగిన కంటెంట్ సెట్టయితే -పడిపడి’పోయిన సినిమాను సైతం లేపడం కష్టమైతే కాదు.