ఆ గ్రహణమే.. ఈ అంగుళీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా కల్పిత పాత్రలతో తెరకెక్కిన సోషియో ఫాంటసీ -అంగుళీక. గ్రహణం టైంలో సూర్యుడు అంగుళీక ఆకారంలో కనిపిస్తాడు. సూర్యభగవానుడి అంశలో పుట్టిన అమ్మాయికి, అంగుళీక సూర్యగ్రహణానికి ఓ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏమిటనే కానె్సప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై దీపక్, శేఖర్ వర్మ, వివ్వశాంత్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు ప్రేమ్ ఆర్యన్ తెరకెక్కించాడు. కోటితూముల, ఎ జగన్మోహన్‌రెడ్డి నిర్మాతలు. సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్‌గా హాజరైన నవీన్‌కుమార్ మాట్లాడుతూ అంగుళీక ట్రైలర్ చూస్తుంటే నిర్మాత పెట్టిన బడ్జెట్, దర్శకుడి ప్రతిభ కనిపిస్తున్నాయి అన్నారు. హీరోయిన్ వివ్యశాంత్ మాట్లాడుతూ -సినిమాలో నా పాత్రం మంచి ఇంపార్టెన్స్ ఉందన్నారు. హీరో శేఖర్ వర్మ మాట్లాడుతూ -ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చిందంటే కారణం నిర్మాత, దర్శకుడు శ్రమేనన్నారు. నిర్మాత కోటితూముల మాట్లాడుతూ -ఇష్టపడి శ్రమకోర్చి నిర్మించిన సినిమాను ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. దర్శకుడు ప్రేమ్ ఆర్యన్ మాట్లాడుతూ -ఆరు వందల ఏళ్లకోసారి వచ్చే అంగుళీక సూర్యగ్రహణం ఈ ఏడాదిలో వస్తుండటం -ఈ సినిమా విశేషం అనుకోవాలి. నిర్మాతల సహకారంతో సినిమాను అనుకున్న విధంగా తీశాం. ఆడియన్స్ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా అన్నారు.