ప్రేమపిపాసి మెప్పిస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ సినిమానైనా ఆడియన్స్ ఆదిరించాలంటే -ఎంటర్‌టైన్ చేసే కథుండాలి. అందుకు తగిన సంగీతం అమరాలి. ఈ రెండూ -ప్రేమపిపాసిలో ఉన్నాయి. సో, సినిమాకు ఆడియన్స్ ఆదరణ దక్కుతుందనే అనుకుంటున్నా అంటున్నాడు నిర్మాత పిఎస్ రామకృష్ణ. ఎస్‌ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్, రాహుల్ బాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిలింస్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం -ప్రేమపిపాసి. దర్శకుడు మురళీ రామస్వామి తెరకెక్కించిన చిత్రంలో జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్లు. 13న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో నిర్మాత పిఎస్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు.
* నేను పుట్టింది విజయవాడ. చదువంతా కాకినాడలో సాగింది. నాన్న ప్రభుత్వోద్యోగి. మాస్టర్స్ డిగ్రీ చేసినప్పటికీ, వ్యాపార రంగంలో స్థిరపడ్డా. 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో కన్‌స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాను. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద పెద్ద ప్రాజెక్టు నడుస్తోంది. నేనే రూపొందించిన ఓ షార్ట్ ఫిల్మ్‌లో గతంలో నటించా. హీరో, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకు నిర్మాతనయ్యా. బ్రీఫ్‌గా ఇదీ నాగురించి.
* దర్శకుడు చెప్పిన కథ గొప్పదో, కాదో జడ్జి చేసేంత అనుభవం నాకు లేదు. కాకపోతే, అతను కథ చెప్పిన విధానం నచ్చింది. కథపై ఎంత నమ్మకంతో ఉన్నాడో అర్థమైంది. ప్రూవ్ చేసుకోడానికి ఒక్క చాన్స్ ఇమ్మని అడిగితే -ప్రోత్సహించేందుకు నిర్మాతనయ్యాను.
*ప్రేమపిపాసి అన్న టైటిలే చాలా విషయాలు చెబుతుంది. సో, యువతరానికి కావాల్సిన బోల్డ్ కంటెంట్ ఇందులో ఉంది. అయతే అది కథలో భాగంగానే ఉంటుంది తప్ప, కమర్షియాలిటీ కోసం తెచ్చిపెట్టింది కాదు
* సినిమా విడుదలకు ముందునుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. సినిమా చూసిన వెల్‌విషర్స్ బాగా వచ్చిందని అంటున్నారు. సెన్సార్ టీం నుంచీ అప్లాజ్ రావడం హ్యాపీ. సినిమా తీయడం సులువే. విడుదల చేయడం అనుకున్నంత సులువు కాదని మొదటి సినిమాతోనే అర్థమైంది.
* ఫస్ట్ కాపీ వచ్చినపుడే దర్శకుడి ప్రతిభపై నమ్మకం కుదిరింది. దర్శకుడు తొలి సినిమా చేశాడన్న భావన ఎక్కడా కలగదు. థియేటర్ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చిన హీరో కనుక -అతని పెర్ఫార్మెన్స్‌పై ఎలాంటి అపనమ్మకాలు అక్కర్లేదు. హిందీలో ఇమ్రాన్ హష్మి తరహాలో జీపీఎస్‌కి లిప్‌లాక్ హీరోగా పేరు రావడం ఖాయం. యూత్‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
* నిర్మాతగా ఏడాదికి ఒక్క సినిమా చేసినా -మంచి సినిమా చేయాలన్న ఆలోచనతో ఉన్నా. మా సంస్థ నుంచి సినిమా వస్తుందంటే -ఆడియన్స్ పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వాలన్నదే నా ఆశ. ఏ జోనర్‌లోనైనా మంచి సినిమాలు చేయడానికే ప్రయత్నిస్తా. ప్రస్తుతం ముగ్గురు దర్శకులతో కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఏ కథతో ఏ సినిమా చేస్తునో వెల్లడిస్తా.