కార్తికేయ కదిలేదెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్టు సినిమాకు సీక్వెల్‌గా నిఖిల్, కార్తికేయ కాంబోలో రానున్న భవిష్యత్ ప్రాజెక్టు -కార్తికేయ 2. ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నామంటూ చిత్రబృందం ప్రకటిస్తున్నా -సెట్స్‌పైకి వెళ్లడానికి ఆలస్యమయ్యే పరిస్థితే కనిపిస్తోంది. సీక్వెల్ చేసే ఉద్దేశంతో చాలాకాలం క్రితమే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసినా -సెట్స్‌పైకి వెళ్లడానికి దర్శక నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కావడం లేదన్న మాట వినిపిస్తోంది. సినిమాను రిచ్‌గా తెరకెక్కించేందుకు దర్శకుడు చందు మొండేటి వేసిచ్చిన బడ్జెట్ -నిర్మాత గుండెల్లో గుబులు పుట్టించిందన్న కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం నిఖిల్ మార్కెట్ అంత స్ట్రాంగ్‌గా లేదు. సో, భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తే వర్కౌట్‌ కాదని నిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా చాలకాలం క్రితమే చేసిన స్క్రిప్ట్ కనుక -ఇప్పటి రీతికి అనుగుణంగా అప్‌డేట్ చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని నిర్మాతలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అదే దర్శకుడు చందు ఈగోని హర్ట్ చేసిన విషయంగా కథనాలు వస్తున్నాయి. క్రియేటివ్ వర్క్‌లో నిర్మాతల జోక్యం తగదంటూ -హీరో నిఖిల్ వద్ద కూడా దర్శకుడు ప్రస్తావించాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. కార్తికేయ మాదిరిగా చిన్న బడ్జెట్‌లో సినిమా తీస్తే వర్కౌట్ కాదని, మైథాలజీని ఫాంటసీగా టచ్ చేస్తున్న కథను రిచ్‌గానే తెరకెక్కించాలన్న పట్టుదలతో చందు ఉన్నాడంటున్నారు. తను వేసిన బడ్జెట్ ప్లాన్ వర్కౌట్ కాకపోతే, కొత్త నిర్మాతను వెతుక్కునే ప్రత్యామ్నాయ ఆలోచనా దర్శకుడి మైండ్‌లోఉందని అంటున్నారు. ఇంతకుముందు ‘సవ్యసాచి’తో ప్లాప్ అందుకున్న చందు మొండేటి -కార్తికేయ 2ని సెనే్సషనల్ హిట్టుచేయాలన్న కసితో ఉన్నారు. అయితే, దర్శక నిర్మాతల మధ్య బడ్జెట్ విషయమై ఓ కొలిక్కి వచ్చేవరకూ -సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు.