శిరీష్ స్ట్రాటజీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీవున్నా -శిరీష్ కెరీర్ స్లోగానే సాగుతోంది. కుర్ర హీరోలోవుండే దూకుడు ఏమాత్రం చూపించకుండా, ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. అయినా కాలం కలిసిరావడం లేదు. శిరీష్ నుంచి చివరి సినిమా ఏమొచ్చిందో ఫ్యాన్స్‌కే గుర్తులేనంత గ్యాప్ రావడంతో -ఇంత గ్యాప్ మంచిది కాదని కొత్త సినిమాకు సిద్ధమవుతున్నాడట. స్ట్రెయిట్ సినిమాలు కలిసి రావడం లేదు కనుక -హిట్టయిన తమిళ రీమేక్‌తో స్క్రీన్‌కొచ్చే ప్రయత్నంలో ఉన్నాడని తెలుస్తోంది. తమిళంలో హిట్టుకొట్టిన ఓ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ -దాన్ని తెలుగు నేటివిటీకి మార్చి స్క్రీన్‌ప్లే రాయించారట. ఆ స్క్రిప్ట్ చేసింది ఎవరో కాదు రాకేష్ శశి. జతకలిసే, విజేత చిత్రాల దర్శకుడు రాకేష్ శశి. ఆ రెండు చిత్రాలూ ప్లాపులే అయినా -రాకేష్ డిజైన్ చేసిన స్క్రిప్ట్ స్టయిల్‌కు ఇంప్రెసైన శిరీష్ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతనూ అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి స్పార్క్ చూసి అవకాశమిచ్చాడోగానీ, శిరీష్ జడ్జిమెంట్ కరెక్టైతే మాత్రం కెరీర్‌కు గొప్ప ప్లస్సే.