లారెన్స్కీ ఓకే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భారతీయ సినీ చరిత్రలో రజనీకాంత్‌ది ఓ స్పెషల్ పేజీ. ఆ పేజీలో విన్యాసాలు, సాహసాలు, స్టైల్స్, మేనరిజమ్స్ వంటివి ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంటాయి. నడకలో వైవిధ్యం, చూపులో విలక్షణం, యాక్షన్‌లో మేనరిజం.. మొత్తంగా రజనీని ఆడియన్స్ ఎప్పుడూ కొత్తగానే చూస్తుంటారు. వచ్చేవాళ్లు వస్తూ వెళ్లేవాళ్లు వెళ్తూవున్నా -రజనీ స్పేస్ మాత్రం రజనీకి ఉంది. తలైవర్‌గా తనకో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రజనీ ఈమధ్యే దర్బార్ చూపించాడు. 168వ ప్రాజెక్టుగా దర్శకుడు శివతో సినిమా చేస్తున్నాడు. సినిమా సెట్స్‌పై ఉండగానే -కొత్త ప్రాజెక్టుకూ క్లియరెన్స్ ఇచ్చేశాడు రజనీ. ఖైదీతో సత్తావున్న దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్‌కు ఆ ఛాన్స్ ఇచ్చాడట రజనీ. విశేషమేంటంటే -సహనటుడు కమల్‌హాసన్ ఈ ప్రాజెక్టుకు నిర్మాత కావడం. రజనీ 170వ ప్రాజెక్టుపైనా అప్పుడే చర్చ మొదలైంది. ఆ ప్రాజెక్టును కొరియోగ్రాఫర్ గా వచ్చి ఇండస్ట్రీలో భిన్న రూపాలు చూపిస్తున్న లారెన్స్ తెరకెక్కిస్తాడట. ఇద్దరి మధ్యా కథా చర్చలు సైతం పూర్తయ్యాయని, లారెన్స్ డిజైన్‌ను రజనీ ప్రశంసించాడన్న టాక్ సైతం వినిపిస్తోంది. ఇక రాజకీయాల్లోకే.. అంటూనే రజనీ వరుస ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ -తనదైన స్టైల్ చూపిస్తున్నాడు రజనీ.