క్లారిటీ.. ఇచ్చేసింది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గత ఏడాది మూడు సినిమాలు చేసిన బాలయ్య -ఒక్కటీ హిట్టుకొట్టలేకపోయాడు. నిజానికి బాలయ్య రేంజ్‌కు తగిన హిట్టుపడి చాలాకాలమే అయ్యింది. అందుకే -హ్యాట్రిక్ హిట్టుకొట్టి కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు సీన్లోని బోయపాటిని దింపాడు. తనకు రెండు హిట్లిచ్చిన బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు. చిత్రీకరణ దశలోవున్న సినిమా కోసం హీరోయిన్ను ఎంపిక చేయడం టీంకి పెద్ద తలపోటుగా మారింది. ముందు -క్యాథరిన్ పేరు వినిపించింది. ఎక్కువ డిమాండ్ చేస్తుందంటూ పక్కన పెట్టేశారు. తరువాత నయనతార పేరు వినిపించింది. నయన్ సైతం బిజీ అని చెప్పేయడంతో -తమన్నా తెరపైకి వస్తోందన్న కథనాలు వినిపించాయి. బాలయ్యతో జోడీకట్టే హీరోయినే కరవైన నేపథ్యంలో -తాజాగా హాట్ బ్యూటీ పాయల్ పేరు సైతం గట్టిగానే వినిపించింది. పాయల్‌ను కన్ఫర్మ్ చేసేసుకున్నారంటూ కథనాలు వచ్చేశాయి. అయితే, బాలయ్యతో నటిస్తున్నానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదంటూ తాజాగా పాయల్ బాంబు పేల్చింది. ‘కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ వార్తలో నిజం లేదు. బాలయ్యకు జోడీగా నేను నటించడం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది పాయల్. ఇప్పటికే వెంకీలాంటి సీనియర్‌కు జోడీగాను, కొన్ని చెయ్యకూడని ప్రాజెక్టులు చేసి కెరీర్‌ను క్రైసిస్‌లోకి నెట్టుకున్న పాయల్ -మరోసారి సీనియర్ హీరోతో చెయ్యకూడదన్న కారణంగానే ఇలా చెప్తుందా? అన్న మాటా వినిపిస్తోంది. ఏదేమైనా -బాలయ్యకు హీరోయిన్ని వెతికే పని మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. బాలయ్యతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎక్కడుందో?