ఎమోషనల్ కిల్లర్‌గా.. తనీష్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గుండె కన్నీరైతే.. ఆవేశం ఆయుధమైతే.. ఆ కత్తి రాసే రుధిర కావ్యమే ఈ మహాప్రస్థానం -అంటూ మహాప్రస్థానం మోషన్ పోస్టర్ విడుదలైంది. ద జర్నీ ఆఫ్ ఏన్ ఏమోషనల్ కిల్లర్ -ట్యాగ్‌లైన్‌తో తనీష్ హీరోగా చేస్తున్న మహాప్రస్థానం ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కత్తి పట్టుకున్న తనీష్ శత్రువులను తుదముట్టిస్తూ వయోలెంట్ లుక్‌లో ఉన్నారు. భావోద్వేగపు వాయిస్ ఓవర్‌తో మొదలైన మోషన్ పోస్టర్.. మహాప్రస్థానం టైటిల్ సాంగ్ బిట్‌తో పూరె్తైంది. ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు జాని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్‌గా ముస్కాన్ సేథీ, భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్‌సింగ్, రాజారవీంద్ర కీలక పాత్రలు చేస్తన్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్‌లోవున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు జాని మాట్లాడుతూ -ఇదొక అసాధారణ సినిమా. తనీష్ పాత్రలోని ఇంటెన్సిటీ ఆడియన్స్‌కి నచ్చుతుంది. వేగంగా పూర్తి చేసిన చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నాం అన్నారు. రిషిక కన్నా, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే ఇతర పాత్రలో నటిస్తోన్న చిత్రానికి సంగీతం సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ ఎంఎన్ బాల్‌రెడ్డి సమకూరుస్తున్నారు.