S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/24/2015 - 10:54

న్యూఢిల్లీ, జూన్ 23: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడిఎంకె అధినేత్రి జయలలితను నిర్దోషిగా హైకోర్టు తీర్పును కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మే 11న జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె ఇద్దరు బంధువులు విఎన్ సుధాకరన్, ఎలవారసిలను హైకోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చింది.

06/24/2015 - 10:53

న్యూఢిల్లీ, జూన్ 23: యోగాను వ్యతిరేకించేవారు భారత్‌లో ఉండే హక్కులేదని, అలాంటివారు పాకిస్తాన్ వెళ్లివచ్చంటూ విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌బి) యోగాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విహెచ్‌పి స్పందించింది. ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీపైనా సాధ్వీ విమర్శలు గుప్పించారు.

06/24/2015 - 10:32

కోల్‌కతా, జూన్ 23: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతలు చేపట్టిన సిస్టర్ నిర్మల మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. 81 సంవత్సరాల నిర్మల గత కొన్ని నెలలుగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్నారని, గతనెల నుంచి ఆమె పరిస్థితి మరింత విషమించిందని కోల్‌కతా ఆర్కిబిషప్ థామస్ డిసౌజా తెలిపారు.

11/20/2015 - 14:52

న్యూఢిల్లీ, మార్చి 12: బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గురువారం ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలో పార్టీ మహిళా నేతలు స్మృతి ఇరానీ, హేమమాలిని, నజ్మాహెఫ్తుల్లాలకు స్థానం లభించలేదు. కాగా, కీలక రాష్ట్రాలయిన పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కార్యవర్గ కీలక సమావేశం వచ్చే నెల బెంగళూరులో జరుగుతుంది.

04/15/2015 - 11:05

న్యూఢిల్లీ, మార్చి 12: ‘మీ ముఖ్యమంత్రి చెప్పినా గుంటూరులోని పొగాకు బోర్డులో మీరు చెప్పిన వ్యక్తిని సభ్యుడుగా కొనసాగనిచ్చే ప్రసక్తే లేదు. పొగాకు బోర్డులోనే కాదు... మరే ఇతర బోర్డులో కూడా సభ్యత్వం లభించకుండా చేస్తాను’ ఈ మాటలు ఎవరో వీధి నాయకుడు చెప్పినవి కాదు, సాక్షాత్తూ కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగుదేశం ఎంపిలతో అన్న మాటలివి.

Pages