జాతీయ వార్తలు

యోగా వద్దంటే దేశాన్ని వదలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: యోగాను వ్యతిరేకించేవారు భారత్‌లో ఉండే హక్కులేదని, అలాంటివారు పాకిస్తాన్ వెళ్లివచ్చంటూ విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌బి) యోగాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విహెచ్‌పి స్పందించింది. ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీపైనా సాధ్వీ విమర్శలు గుప్పించారు. ఆదివారంనాడు ఢిల్లీ రాజ్‌పథ్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి అన్సారీ గైర్హాజరీపై ఆమె మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరినీ ఆహ్వానించడానికి ఇదేదీ ఓ రాజకీయ నాయకుడి కుమార్తె పెళ్లి కాదు’ అని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరు కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో మిళితం కావల్సిందేనని ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసం లేదు’ అని అన్నారు. ఒకవేళ అలాంటి అభ్యంతరాలు ఉంటే పాకిస్తాన్ వెళ్లిపోవాలని అన్నారు. భారతదేశ సంప్రదాయాలను వ్యతిరేకించే వారికి దేశంలో నివసించే హక్కులేదని ఆమె తీవ్రస్వరంతో అన్నారు. భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్ పాటలు పాడుతున్నారని పేర్కొన్న ఆమె యోగా అనేది అన్ని కులాలు, మతాల ప్రజలను సంధానం చేసే వారధిలాంటిదని అన్నారు.
భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను వ్యతిరేకించాలని ప్రజాస్వామ్యం చెప్పదని ఆమె స్పష్టం చేశారు. సాధ్వీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ విరుచుకుపడింది. యోగాలో పాల్గొనడం లేదా పాల్గొనకపోవడం అన్నది ప్రజల హక్కని ఈ విషయంలో ఎవరూ ఎవరిపైనా బలవంతం చేసే పరిస్థితి లేదని కాంగ్రెస్ ప్రతినిధి సంజయ్ ఝా పేర్కొన్నారు.