జాతీయ వార్తలు
ఢిల్లీలో స్వల్ప భూకంపం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు తల్లడిల్లుతుంటే సోమవారం ఢిల్లీ ప్రజలను భూకంపం వణికించింది. అయితే భూకంపం తీవ్రత (2.7) స్వల్పంగా ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టమేమీ జరగలేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. 24 గంటల్లో ఇది రెండోసారి. ఈశాన్య ఢిల్లీలోని వాజిపూర్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 1.26 గంటలకు భూమి కంపించినట్లు ఎన్సీఎస్ ఆపరేషన్స్ ప్రధాన అధికారి జేఎల్ గౌతం తెలిపారు. ఆదివారం కూడా భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు పరుగెత్తుకుని వచ్చారు. ఆదివారం భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ళలో భయం, భయంగా గడుపుతున్న సమయంలో రెండో సారి భూమి స్వల్పంగా కంపించింది. అయితే ఆదివారం భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5 చూపించగా, సోమవారం 2.7గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 8 కిమీ దూరంలోనే ఇది సంభవించింది. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున ప్రజలందరూ ఇళ్ళలోని గడుపుతున్నారు. ఈ సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఒకవైపు కరోనా, మరోవైపు భూమి కంపించడంతో దేశ రాజధాని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసలే కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుండగా, భూకంపం కూడా తమను వెంటాడుతున్నదేమిటా? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.