S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/22/2015 - 06:35

కౌలాలంపూర్, నవంబర్ 21: మలేషియాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా మువ్వన్నెల జెండాను తల్లకిందులుగా ఆవిష్కరించడం భారత్‌కు ఇబ్బంది కలిగించింది. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ కౌలాలంపూర్‌లో జపాన్ ప్రధాని షింజో అబేతో ద్వైపాక్షిక చర్చలు జరపడానికి ముందు ఆయనతో కరచాలనం చేస్తుండగా వారి వెనుకే ఈ ఘటన జరిగింది.

11/22/2015 - 06:27

కనిపించని కుట్రలు...అబద్ధాల దాసులు
పరోపకారిణి వార్షిక రుషి మేళా సభలో ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్త్రి

11/22/2015 - 06:17

సాంస్కృతిక శాఖ కార్యాచరణ

11/22/2015 - 06:14

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆదేశం

11/21/2015 - 16:05

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆనాటి అశాంతి వాతావరణాన్ని మరోసారి సృష్టించడానికి ఈ రోజు రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నది' అని పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి, అకాలీ దళ్‌ నేత సుఖ్‌బీర్‌ సింగ్ బాదల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకున్న చరిత్ర ఆ పార్టీదని శనివారం విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.

11/21/2015 - 13:29

కౌలాలంపూర్ ‌: మారిన భారత్‌ను చూడాలని, పెట్టుబడులకు భారత్‌ గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సంస్కరణలవైపు ప్రతి ఒక్కరూ అడుగు వేయాల్సిందేనని అన్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఏర్పాటు చేసిన ఏసియన్‌ దేశాల వాణిజ్య సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. సంస్కరణలకు అంతమంటూ ఉండదు, కొనసాగాల్సిందేనన్నారు.

11/21/2015 - 06:13

బెంగళూరు, నవంబర్ 20: కర్నాటకలో బేలెకెరె రేవునుంచి ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో గనుల వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డిని శుక్రవారం లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. ఇనుప ఖనిజం ఎగుమతికి సంబంధించి చోటుచేసుకున్న అక్రమాల్లో గాలి కంపెనీ ప్రమేయం ఉన్నట్టు లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు విభాగం ఆరోపణ. ఇంతకు ముందు గనుల అక్రమ తవ్వకం కేసుల్లో అరెస్టయిన జనార్దన్‌రెడ్డి చాలాకాలం జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు.

11/21/2015 - 06:12

న్యూఢిల్లీ, నవంబర్ 20: జిహెచ్‌ఎంసి పరిధిలో ఓటర్లను తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన రాజకీయ పార్టీలకు దురుద్దేశాలు ఆపాదించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌ను వెంటనే తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

11/21/2015 - 06:09

న్యూఢిల్లీ, నవంబర్ 20: వ్యాపం కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేశ్ యాదవ్‌ను ఆ పదవిలోనుంచి తొలగించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆయనను, కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.

11/21/2015 - 05:26

న్యూఢిల్లీ, నవంబర్ 20: బిజెపి రాజకీయ అజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రధమస్థానంలో ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేసే ప్రసక్తిలేదని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావుస్పస్టం చేశారు. టిడిపితో పొత్తు యథాతధంగా కొనసాగుతుందని చెబుతూ తెలంగాణలో మాత్రం ఎవరితోనూ పొత్తులేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని శుక్రవారం ఇక్కడ విలేఖరులతో చెప్పారు.

Pages