జాతీయ వార్తలు

స్మార్ట్‌సిటీలకు పైపుల ద్వారా వంటగ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆదేశం
న్యూఢిల్లీ, నవంబర్ 21: స్మార్ట్‌సిటీల నిర్మాణానికి ఎంపికైన నగరాల్లో వంటగ్యాస్‌ను పైపుల ద్వారా గృహాలకు సరఫరా చేయటానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. స్మార్ట్ సిటీల నిర్మాణంలో ముఖ్యపాత్ర వహించే స్థానిక సంస్థలు తమ పరిధిలో పైపుల సాయంతో వంట గ్యాస్‌ను అందచేయటానికి కావలసిన ప్రాధమిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని పట్టణాభివృద్ధిశాఖ సహాయ కార్యదర్శి సమీర్‌శర్మ స్పష్టం చేశారు. అంతేకాక స్మార్ట్‌సిటీల అభివృద్ధికి సంబంధించి అమలుచేయనున్న పథకాలపై డిసెంబర్ 15లోగా స్థానిక సంస్థలు తమ ప్రాజెక్టు రిపోర్టులను అందచేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును పొడిగించటం జరగదని ఆయన చెప్పారు. పైపులతో వంట గ్యాస్‌ను సరఫరాచేయాడానికి ఎలాంటి ఇబ్బందులుండవని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీలకు సౌర విద్యుత్‌ను సబ్సిడీ ధరకు అం దచేయటం వల్ల వినియోగదారుకు ఐదున్నర రూపాయలకే యూనిట్ కరెంట్ లభిస్తుందన్నారు.