జాతీయ వార్తలు

భన్వర్‌లాల్‌ను తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: జిహెచ్‌ఎంసి పరిధిలో ఓటర్లను తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన రాజకీయ పార్టీలకు దురుద్దేశాలు ఆపాదించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌ను వెంటనే తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. జిహెచ్‌ఎంఎస్ పరిధిలో ఓటర్ల పేర్లను తొలగించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న కుట్రపై దర్యాప్తు జరిపించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజప్తి చేశారు. శశిధర్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక వినతిపత్రం అందజేశారు. ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించటంపై భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించటంపై ఫిర్యాదు చేసిన రాజకీయ పార్టీలను భన్వర్‌లాల్ తప్పుపట్టటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సమర్థిస్తోందా? అని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో పని చేస్తున్నారా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. భన్వర్‌లాల్ టివి ఇంటర్వ్యూ లో రాజకీయ పార్టీలను విమర్శించవచ్చా? అని శశిధర్ అడిగారు.
కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తోందంటూ భన్వర్‌లాల్ చేసిన ఆరోపణ నిజామా అని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పని చేసే సంస్థ అయిన పక్షంలో భన్వర్‌లాల్‌పై వెంటనే చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా పనిచేసిన సోమేష్‌కుమార్‌పై కూడా చర్య తీసుకోవాలని శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.