జాతీయ వార్తలు

ప్రధాని సమక్షంలోనే మువ్వన్నెల జెండా తలకిందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, నవంబర్ 21: మలేషియాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా మువ్వన్నెల జెండాను తల్లకిందులుగా ఆవిష్కరించడం భారత్‌కు ఇబ్బంది కలిగించింది. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ కౌలాలంపూర్‌లో జపాన్ ప్రధాని షింజో అబేతో ద్వైపాక్షిక చర్చలు జరపడానికి ముందు ఆయనతో కరచాలనం చేస్తుండగా వారి వెనుకే ఈ ఘటన జరిగింది. భారత జాతీయ పతాకంలోని ఆకుపచ్చ రంగు భాగాన్ని పైకి, కాషాయ రంగు భాగాన్ని కిందికి ఉంచి ఆవిష్కరించడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. అయితే హడావుడిలో అనుకోకుండా ఈ పొరపాటు జరిగిందని, ఇందుకు మన్నించాలని అధికార వర్గాలు వేడుకున్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం మలేషియా చేరుకున్న మోదీ ఆసియాన్-్భరత్-తూర్పుఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ఆదివారం అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.